ఈ శుక్రవారం థియేటర్లలో కొత్త సినిమాలేవీ రిలీజ్ కాలేదు కానీ.. ఓటీటీల్లో మాత్రం మంచి మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు 20వ తేదీన స్ట్రీమ్ అవుతున్నాయి. సమ్మర్ బొనాంజాగా ఒక్కో ఓటీటీలో ఒక్కో కొత్త సినిమా సందడి చేయబోతోంది. అవేంటో ఓసారి చదివి తెలుసుకుందాం..
కొవిడ్ తర్వాత థియేటర్ల కంటే ఇంట్లో ఉండి ఓటీటీల్లో వచ్చిన సినిమాలను చూస్తూ.. ఫ్యామిలీ మొత్తం ఎంటర్టైన్ అవుతోంది. దీనికి చాలామంది అలవాటుపడ్డారు. అయితే.. కొన్ని ఫ్యామిలీ మొత్తం చూడాల్సినవి ఉండడం లేదు. ఎక్కువగా ఎ సర్టిఫికెట్ ఉన్న సినిమాలు కూడా ఓటీటీల్లో ఉంటున్నాయి. అంతేకాకుండా వల్గర్ లాంగ్వేజీ, సెక్స్ కంటెంట్ వంటివి ఓటీటీల్లో ఎక్కువగా ఉంటుండడంతో ఇంట్లో ఎదిగిన పిల్లలతో కలిసి కుటుంబం మొత్తం అట్లాంటి సినిమాలు చూడాలంటే ఇబ్బందిగానూ ఉంటుంది. అయితే.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన మూవీస్‌ని మాత్రం ఇంటిల్లిపాది ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు.
01) దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్‌ఆర్’.. రామ్‌చరణ్, తారక్ హీరోలుగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర దాదాపు 1100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఇది ‘జీ5’లో స్ట్రీమ్ అవుతోంది. అయితే దీని కోసం కొంతమొత్తం చెల్లించాలి అంటున్నారు.
02) మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ‘ఆచార్య’. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తొలిసారి ఫుల్ లెంగ్త్ రోల్స్‌లో కలసి నటించిన సినిమా ఇది. కొరటాల శివ డైరెక్ట్ చేశారు. అయితే బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయిందనే టాక్ వచ్చింది. దీన్ని అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు.
03) హాట్ స్టార్‌లో ఓ సూపర్ స్టార్ సినిమా రాబోతోంది. మోహన్‌లాల్ నటించిన ‘12th మ్యాన్’ మూవీని స్ట్రీమింగ్ అవుతోంది. జీతూ జోసెఫ్ రూపొందించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. మిస్టరీ సినిమాగా రూపొందిన ఈ చిత్రం మోహన్‌లాల్ బెస్ట్ పర్‌ఫార్మెన్స్‌ను మరోసారి చూపిస్తుందని అంటున్నారు.
04) షాహిద్ కపూర్ ‘జెర్సీ’ కూడా ఇవ్వాలే స్ట్రీమ్ అవ్వబోతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను చూడొచ్చు. తెలుగు ‘జెర్సీ’తో పోలిస్తే సమానంగా ఉందని చెప్పిన హిందీ ‘జెర్సీ’.. ‘కేజీయఫ్ 2’ దెబ్బకి థియేటర్లలో కుదేలైపోయింది. మరి ఓటీటీలో ఏం చేస్తుందో చూడాలి. ఈ సినిమాతో పాటు శ్రీవిష్ణు నటించి ‘భళా తందనాన’ కూడా ఇవ్వాలే (శుక్రవారమే) వస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాకు థియేటర్లలో సరైన స్పందన రాలేదు.