దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా, రైతాంగం నడ్డివిరిచేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎరువుల ధరల పెంపు నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎరువుల ధరల పెంపుపై తన నిరసన వ్యక్తం చేస్తూ సాయంత్రం ప్రధానికి బహిరంగ లేఖ రాయనున్నట్టు తెలుస్తోంది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేదాకా ఎక్కడికక్కడ నిలదీయాలని ఈ సందర్భంగా ప్రజలకు సీఎం కెసీఆర్ పిలుపునిచ్చారు. కేంద్రం తక్షణమే పెంచిన ఎరువుల ధరలను తగ్గించకపోతే రాష్ట్రంతో పాటు.. దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టి కేంద్రం మెడలు వంచుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం కుట్రలను రాష్ట్ర రైతాంగం అర్థం చేసుకుని.. ధరలు తగ్గించే దాకా బీజేపీ ప్రభుత్వంపై సాగే పోరాటంలో కలిసిరావాలనీ పిలుపునిచ్చారు.