ఉమ్మడి కరీంనగర్, ప్రభన్యూస్ బ్యూరో
కరీంనగర్ జిల్లా అంటేనే ఉద్య మాల ఖిల్లా… తెలంగాణ రైతాంగ పోరాటం… నక్సల్‌బరి ఉద్యమం.. తెలంగాణ సాయుధ పోరాటం నుండి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లానే కేంద్ర బిందువుగా నిలిచింది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన మలి దశ పోరాటంలో ఉద్యమ రధసారధి కేసీఆర్ ఉద్యమాల గడ్డ నుంచే సమరశంఖం పూరించి దశాబ్ధాల కలను నిజం చేయడంతో కరీంనగర్ ప్రాముఖ్యత మరింత పెరిగింది. రాజకీయ చైతన్యం గల కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుం డడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 13 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా, 11 చోట్ల అధికార బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంథనిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హుజురాబాద్‌లో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడోసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెజార్టీ స్థానాలు -కై-వసం చేసుకునేందుకు అధికార పార్టీ వ్యూహాలు పన్నుతుంది. బీఆర్ ఎస్‌కు గట్టి పోటీ- ఇచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీలు సిద్ధమవుతుండడంతో మెజారిటీ- నియోజక వర్గాల్లో త్రిముఖ పోటీ- నెలకొననుంది.
సిరిసిల్ల నియోజకవర్గం నుండి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నియోజక వర్గం నుండి వరుస విజయాలు సాధిస్తున్నారు. ఓటమెరుగని నాయకుడు కేటిఆర్‌కు కాంగ్రెస్, బీజేపీ నుండి బలమైన ప్రత్యర్థులు లేరని చెప్పాలి. కేకే మహేందర్ రెడ్డి కొనసాగుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో మాత్రమే వస్తాడన్న ప్రచారం ఉండడంతో పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. సిరిసిల్లను అభివృద్ధిలో నెంబర్ వన్‌గా నిలపడంతో మంత్రి కేటీఆర్‌కు తిరుగులేదనే చెప్పాలి.
వేములవాడ నియోజకవర్గం నుండి చెన్నమనేని రమేష్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనను జర్మనీ పౌరసత్వం కేసు వెంటా-డుతోంది. నియోజకవర్గం లో ఆయన కూడా ఓటమి ఎరుగని నాయకుడే అయినప్పటికి ఈ కేసు వ్యవహారం వల్ల టికెట్ మారవచ్చని, మార్చితే చల్మెడ లక్ష్మీనరసింహరావుకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ నుండి అది శ్రీనివాస్, బీజేపీ నుండి మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు కుమారుడు డాక్టర్ వికాస్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ త్రిముఖ పోటీ- అనివార్యం.
కరీంనగర్ అసెంబ్లీ నుండి మంత్రి గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు గెలిచి రికార్డ్ సృష్టించిన గంగుల నాలుగోసారి గెలుపు కోసం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. మునుపెన్నడు లేని విధంగా నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేశారు. కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులు ఎవరనేది తేలాల్సి ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇక్కడి నుండి పోటీ- చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ త్రిముఖ పోటీ- తప్పదు.
చొప్పదండి ఎస్ సి నియోజకవర్గం నుండి నుండి సుంకె రవిశంకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ నుండి మేడిపల్లి సత్యం, బీజేపీ నుండి మాజీ ఎమ్మెల్యేలు సుద్దాల దేవయ్య, బోడిగ శోభల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ త్రిముఖ పోటీ- ఉండనుంది.
లమానకొండూర్ నియిజక వర్గం నుండి తెలంగాణ సాంస్కృ తిక సారథి రసమయి బాలకిషన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ నుండి ఆ పారీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ పోటీ-కి సిద్ధం అవుతున్నాడు. బీజేపీలో టికెట్ల లొల్లి నడుస్తుంది.
హుజురాబాద్ నుండి బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈటలకు చెక్ పెట్టేందుకు బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డిని రంగంలోకి దించారు. కాంగ్రెస్ నుండి తిరిగి పోటీ-కి బల్మూరి వెంకట్ సిద్ధం అవుతున్నారు. అయితే బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా.. అనే రీతిలో తీవ్రమైన పోటీ ఉండనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం రావడంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు.
హుస్నాబాద్ నుండి ఒడితెల సతీష్ బాబు బీఆర్‌ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ నుండి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. బీజేపీ నుండి బొమ్మ శ్రీరాం చక్రవర్తి పోటీ-లో ఉండనున్నారు. సిపిఐ- బీఆర్‌ఎస్ పొత్తులో టికెట్ వస్తుందని తొలుత ఆలోచించినా పొత్తుల విషయంలో ఎటు- తేలకపోవడంతో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి పోటీ-కి సిద్ధం అవుతున్నారు. ఇదే జరిగితే ఇక్కడ చతుర్ముఖ పోటీ- అనివార్యం కానుంది.
జగిత్యాల నుండి డాక్టర్ సంజయ్ బీఆర్‌ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఈసారి గట్టి పోటీ- ఇవ్వనున్నారు. బీజేపీ అభ్యర్థి వేటలో పడింది.
ధర్మపురి నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. బీఆర్‌ఎస్ నుంచి మంత్రి ఈశ్వర్ పోటీ చేయనుండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పోటీలో ఉండను న్నారు. బీజేపీ నుంచి గడ్డం వివేక్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయకపోతే బీజేపీ నుంచి కన్నం అంజయ్య మరోసారి పోటీ చేయనున్నారు. ధర్మపురిలో త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది.
కోరుట్ల అసెంబ్లీ నుండి కె.విద్యాసాగర్ రావు బీఆర్‌ఎస్ నుంచి వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. ఈ సారి ఆయన కుమారుడు డాక్టర్ సంజయ్‌ని రంగంలో దించాలని అధిష్టానం దాదాపు నిర్ణయానికి వచ్చింది. సంజయ్ మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్ నుండి జువ్వాడి నర్సింగరావు పోటీ-లో ఉండే ఆ ఆకాశం ఉంది. బీజేపీ అభ్యర్థి ఎవరో తేలాల్సి ఉంది. ఇక్కడ త్రిముఖ పోటీ ఉండే అవకాశాలున్నాయి.
పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా దాసరి మనోహర్ రెడ్డి కొనసాగుతున్నా రు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2018లో వరుసగా రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్ని-కై- దాసరి రికార్డు సృష్టించారు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ నుండి దాసరి మూడో సారి పోటీ- చేయనున్నారు. ఇప్పటికే అధిష్టానం నుండి మరోసారి టికెట్ కన్ఫామ్ చేసినట్లు- సమా చారం. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి చేయడం మనోహర్‌రెడ్డికి కలిసి రానుంది. బిఆర్‌ఎస్‌కు గట్టి పోటీ- ఇచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రజల దగ్గరకు వెళ్తున్నాయి.
రామగుండం నియోజకవర్గంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన కోరుకంటి చందర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. చందర్‌కు బీఆర్‌ఎస్ టికెట్ రావడంలో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లా అధ్యక్షు లు మక్కాన్‌సింగ్ పోటీ చేయనున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణతోపాటు కౌశిక హరిలు టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ- నెలకొననుంది.
మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా శ్రీధర్ బాబు కొనసాగుతున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అధికార పార్టీ నుండి పోటీ- చేయనున్నారు. ఇక్కడ బీజేపీ నామమాత్రంగా ఉండడంతో ద్విముఖ పోటీ- ఉండనుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా.. అనే రీతిలో
గట్టి పోటీ- ఉండనుంది.