హైదరాబాద్ లో వనమా రాఘవను అరెస్ట్ చేశారు కొత్తగూడెం పోలీసులు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కాగా కొత్తగూడెం జిల్లా పాల్వంచంలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు కలిగిస్తుంది. ఇటీవల పాల్వంచలో రామకృష్ణ, తన భార్య, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా బాధితుడు రామకృష్ణ చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కొడుకు వనమా రాఘవేందర్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు.
సమస్యల పరిష్కరించడానికి తన భార్యను పంపాల్సిందిగా కోరాడని బాధితుడు ఆరోపించడం సంచలనంగా మారింది. దీంతో ఈ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్ పార్టీపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.ఈ విమర్శల మధ్య ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ రాశారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తనును బాధకు గురిచేసిందని అన్నారు. చట్టం, న్యాయంపై నమ్మకం ఉందన్నారు. తన కొడుకు రాఘవేంద్ర దర్యాఫ్తుకు సహకరించేలా చేస్తానని అన్నారు. కేసులో నిజా నిజాలు తేలే వరకు తన కొడుకును పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతానని హామీ ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..