Saturday, November 23, 2024

Big Breaking : ప‌వ‌ర్ ప్లాంట్ ను తిరిగి స్వాధీనం చేసుకున్న‌ ‘ఉక్రెయిన్’

ఉక్రెయిన్ ఆధీనంలో జ‌పొరిజియా అణువిద్యుత్ కేంద్రం..ప‌వ‌ర్ ప్లాంట్ ను తిరిగి స్వాధీనం చేసుకుంది ఉక్రెయిన్. కాగా ఉక్రెయిన్ పై మిసైల్స్, బాంబులతో రష్యా విధ్వంసం సృష్టిస్తోంది. ఓ వైపు చర్చలు జరుపుతూనే దాడులకు పాల్పడుతోంది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఆంక్షలను ఏ మాత్రం లెక్క చేయటం లేదు. ఉక్రెయిన్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, అపార్ట్ మెంట్లపైనా క్షిపణి దాడులకు దిగుతోంది. ఇప్పుడు ఏకంగా ఉక్రెయిన్ లోని ఎనెర్గోడర్ లో ఉన్న జపోరిజియా అణు విద్యుత్ కేంద్రంపై రష్యా దాడులు చేస్తోందని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి డిమిత్రో కులెబా చెప్పారు. ఐరోపాలోనే అతి పెద్ద అణువిద్యుత్ కేంద్రం అయిన జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై రష్యన్ ఆర్మీ దాడులకు పాల్పడింది. న్యూక్లియర్ ప్లాంట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర దాడులు ఆపి.. అగ్నిమాపక సిబ్బందిని లోపలికి వెళ్లనివ్వాలని రష్యాను కోరుతున్నాం’’ అని కులెబా అన్నారు. ఈ న్యూక్లియర్ ప్లాంట్ లో పేలుడు సంభవిస్తే.. చెర్నోబిల్ పేలుడు కంటే 10 రెట్లు భారీ నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ ఆధీనంలోకి జ‌పొరిజియా అణు విద్యుత్ కేంద్రం వ‌చ్చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement