కేంద్ర మంత్రి అమిత్ షాతో గవర్నర్ తమిళి సై భేటీ ముగిసింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.. తెలంగాణ పరిస్థితులను వివరించారు గవర్నర్ తమిళి సై. రాష్ట్ర ప్రభుత్వం అవమానిస్తోందని నిన్న తమిళిసై ఆరోపణలు చేశారు. నేను ఏది మాట్లాడినా ప్రజల కోసమే అన్నారు. ప్రజలకు మేలు జరిగేలా హోం మంత్రితో చర్చించామన్నారు. ఎవరి సహకారం అందకపోయినా ముందుకు వెళ్తానని ఆమె తెలిపారు. మేడారం,భద్రాచలం రోడ్డు మార్గంలోనే వెళ్లానని చెప్పారు.తెలంగాణ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. తెలంగాణలో ఏం జరుగుతుందో తెలిసిందేనన్నారు.గవర్నర్ ను ఎందుకు అవమానిస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలి. నేను మేడారం వెళితే అధికారులు ఎందుకు రాలేదని గవర్నర్ ప్రశ్నించారు. తెలంగాణ గవర్నర్ పర్యటించాలంటే రోడ్డు మార్గమే దిక్కని అన్నారు. శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాచలం వెళతానని చెప్పారు. యాదాద్రికి వెళితే ఒక్క అధికారి రాలేదన్నారు. రాజ్ భవన్, గవర్నర్ ను కావాలనే అవమానిస్తున్నారని ఆరోపించారు.
Big Breaking : తెలంగాణ సర్కార్ సహకరించకపోయినా ముందుకెళ్తా – గవర్నర్ తమిళి సై
Advertisement
తాజా వార్తలు
Advertisement