తమిళనాడులో బిజెపికి షాక్ ఇచ్చారు ఆ పార్టీ కీలక నేతలు. బిజెపికి చెందిన 13మంది కీలకనేతలు ఆ పార్టీని వీడి అన్నా డీఎంకేలో చేరడం విశేషం. మాజీ సీఎం పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే తమ పార్టీ నేతలకు ఎర వేస్తున్నదని ఓ వైపు బీజేపీ ఆరోపిస్తుండగానే తాజాగా ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. ఇవాళ బీజేపీని వీడిన 13 మంది నేతలు పశ్చిమ చెన్నైలోని ఐటీ విభాగానికి చెందినవారు. తాను బీజేపీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నానని, ఎలాంటి పదవులను ఆశించలేదని, అయితే పార్టీలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తనను పార్టీని వీడేలా చేశాయని బీజేపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు అంబరాజన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అంబరాజన్తోపాటు ఇవాళ బీజేపీని వీడిన వారిలో 10 మంది ఐటీ వింగ్ జిల్లా కార్యదర్శులు, ఇద్దరు ఐటీ వింగ్ డిప్యూటీ కార్యదర్శులు ఉన్నారు. అంతకుమునుపే బీజేపీ ఇంటెలెక్చువల్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణన్, ఐటీ వింగ్ రాష్ట్ర కార్యదర్శి దిలీప్ కన్నన్, తిరుచ్చి రూరల్ జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్, రాష్ట్ర ఓబీసీ వింగ్ కార్యదర్శి అమ్ము అన్నాడీఎంకేలో జాయిన్ అయ్యారు.
Big Breaking : తమిళనాడులో బిజెపికి షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన 13మంది కీలకనేతలు
Advertisement
తాజా వార్తలు
Advertisement