సీఎం కేసీఆర్ బీజేపీ పై విమర్శనాస్త్రాలు సందించారు. ఈరోజ ఉదయం బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలపై సాయంత్రం నాలుగు గంటలకు ప్రెస్మీట్ పెట్టిన సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్ ఏమన్నారంటే..
“గొర్రెల పథకానికి కేంద్రం రూపాయి ఇచ్చినట్టు నిరూపిస్తే నేను సీఎం పదవికి రాజీనామా చేస్తా. మా పథకాన్ని మీ పథకం అని ఎలా చెప్తారు. మీ పథకం అయితే కర్నాటకలో ఎందుకు పెట్టలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో బండి సంజయ్ ఎక్కడున్నావు. నేను ఏం చేసిన్నో నీకు చెప్పాలా. తల తోక ఉండి మాట్లాడుతున్నావా. మీ కేంద్ర మంత్రులను అడుగు నేను ఏం చేశానో. పిడుగు అదే మంత్రం, పెళ్లికి అదే మంత్ర అన్నిటికీ అదే అంటే నడవదు. నడుమంత్రపు మాటలు మాట్లాడితే బూమరాంగ్ అయితది.. దెబ్బ రివర్స్ తగులుద్ది జాగ్రత్త.. ఈరోజు దేశంలో ఎలక్షన్లలో డబ్బు ఎక్కు ఖర్చు పెట్టేది ఏ పార్టో ఎవరిని అడిగిని బేజేపీ అని చెబుతరు.” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.