Wednesday, November 20, 2024

Big Breaking : ఇండోనేషియాలో భూకంపం – 6.0తీవ్ర‌త – సునామీ హెచ్చ‌రిక‌లు

ఇండోనేషియాని వ‌రుస భూకంపాలు వ‌ణికిస్తున్నాయి. ఈ నెల‌లోనే అంటే ఏప్రిల్ లోనే దాదాపు నాలుగుసార్లు భూకంపాలు రావ‌డం గ‌మ‌నార్హం. కాగా నేడు ఉదయం 6.0 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఇండోనేషియా వాతావరణ శాఖ సునామీ హెచ్చరిక జారీ చేసింది. తీర ప్రాంతాల్లో నివసించే జనం ఇండ్లను ఖాళీ చేయాలని సూచించింది. ఉదయం 6.73 గంటల ప్రాంతంలో రిక్టర్‌ స్కేల్‌పై 6.0 తీవ్రతతో బలమైన ప్రకంపనలు రికార్డయ్యాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. సులవేసి కొటమోబాగుకు 779 కిలోమీటర్ల దూరంలో, భూమికి 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. అయితే, ఇప్పటి వరకు నష్టంకు సంబంధించిన వివరాలు అందలేదని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement