పీఆర్సీపై ఏపీ సర్కార్ ప్రకటన చేసింది. ఏపీ ఉద్యోగులకు 23.29శాతం ఫిట్ మెంట్. సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాల భేటీలో నిర్ణయం తీసుకున్నారు. రిటైర్ మెంట్ వయసుని 62ఏళ్లకు పెంచారు. ప్రభుత్వం కట్టే ఇళ్ల కాలనీల్లో ఉద్యోగులకు పది శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఇక మంచి పీఆర్ సీ ఇచ్చారని వెంకట్రామిరెడ్డి అన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై అంతా హ్యాపీగా ఉన్నారన్నారు. గ్రామ,వార్డు సచివాలయాల్లో పని చేసే ఉద్యోగులందరికీ జూన్ 30లోగా ప్రొబేషన్ కన్ ఫర్మేషన్. ఈ ఏడాది జూలై నుంచి రెగ్యులర్ పే స్కేల్ అమలు కానుంది. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నీ ఏప్రిల్ కంతా క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. సొంత ఇల్లు ప్రభుత్వ ఉద్యోగులకు జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో ఎంఐజీ లే అవుట్లలో పది ప్లాట్ల రిజర్వ్.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..