హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం భూమ్ భూమ్ అంటోంది. కరోనా తర్వాత భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇంటి రుణ రేట్లు, ప్రాపర్టీ ధరలు కూడా బాగా పెరిగాయి. దీంతో ఈ ఏడాది (2023)లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇతర రాష్ట్రాల కంటే దూసుకుపోతోంది. నైట్ ఫ్రాంక్ కు చెందిన సూచిక 2023 ప్రకారం.. హైదరాబాద్ సిటీలో సగటు కుటుంబానికి చెందిన గృహ రుణ EMI ఆదాయంలో 55శాతం ఉన్నట్టు వెల్లడించింది. ఇక.. ముంబై అత్యంత భరించలేని రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా మారినట్టు ఆ సంస్థ తన రిపోర్ట్‌లో తెలిపింది. మరోవైపు, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రియల్ ఎస్టేట్ అత్యంత తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే నగరంలో గృహ రుణ EMI నుండి ఆదాయ శాతం 23 శాతం మాత్రమే ఉండడం గమనార్హం.
హైదరాబాద్ రియల్ జోరు..
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో, 2023లో గృహ రుణ EMI నుండి ఆదాయ నిష్పత్తి 31 శాతం ఉంది. ఇది 2019లో స్థోమతతో పోల్చినప్పుడు మెరుగుదల కనిపిస్తున్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడానికి ముందు సంవత్సరంలో గృహ రుణ EMI నుండి ఆదాయ శాతం 34శాతంగా ఉండేది. ఏది ఏమైనప్పటికీ గృహ రుణం, ఆదాయ నిష్పత్తి ఎక్కువగా ఉన్న కారణంగా హైదరాబాద్ అత్యంత భరించలేని రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా రెండో స్థానంలో కొనసాగుతోంది. జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లో ఈ శాతం 30 శాతం కాగా, చెన్నై, బెంగళూరులో ఇది 28 శాతంగా ఉంది.
ఎన్నారైలకు టాప్ మోస్ట్ లవబుల్ సిటీ హైదరాబాద్..
భారతదేశంలో రెండవ అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్ అయినప్పటికీ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ని ఎన్నారైలు లైక్ చేస్తున్నారు. వారి రాకతో మరింత భూమ్ రాబోతున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుఎస్, కెనడా, గల్ఫ్, యూరప్ మొదలైన దేశాల్లో నివసిస్తున్న ఎన్నారైలలో చాలామంది హైదరాబాద్‌లోని హౌసింగ్ యూనిట్లను ఇష్టపడుతున్నారు.
రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడులతో పోలిస్తే స్టాక్, మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన రాబడిని అందిస్తున్నప్పటికీ.. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ(-ఎన్‌సిఆర్) వంటి టాప్ మోస్ట్ సిటీస్‌లో గృహాలను కొనుగోలు చేయడానికి ఎన్ఆర్ఐలు మొగ్గు చూపుతున్నారు. COVID-19 సమయంలో వారి అనుభవం దీనికి కారణంగా తెలుస్తోంది. వారిలో చాలా మంది ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నవారు.. మహమ్మారి సమయంలో తమ ఉద్యోగాలను కోల్పోయారు. వారు భారతదేశానికి తిరిగి భావిస్తున్నారని, అందుకే ఇంటి స్థలాలు, ఇండ్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.