మెగాస్టార్ చిరంజీవి చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. దాంతో ఆయన బిజీ బిజీగా ఉన్నారు. కాగా ఆయన నటిస్తున్న భోళా శంకర్ చిత్రం నుండి ప్రత్యేకవీడియోని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ వీడియోలో చిరంజీవి కొత్త హెయిర్ స్టైల్ తో ,గూగుల్స్ పెట్టుకుని, చేతికి తాయత్తులతో చిరంజీవి ఆలరించారు. ప్రస్తుతం చిరంజీవి చేతిలో ‘ఆచార్య’ చిత్రం కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమాకు సంబంధించిన పాటలు, స్టిల్స్ విడుదల చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ.
ఓ వైపు ఆ సినిమాకు సంబంధించి అప్డేట్స్ వస్తోంటే మరోవైపు ‘భోళా శంకర్’ చిత్ర బృందం కూడా ఈ సర్ప్రైజ్ లుక్ విడుదల చేయడంతో చిరు అభిమానులు ఖుషీ అవుతున్నారు. 18 క్షణాల పాటు ఉన్న ఈ వీడియో ‘భోళా శంకర్ వీడియోను.. ఈ సినిమా ఏ రేంజ్లో ఉండనుందో తెలిపేలా రూపొందించారు మెహర్ రమేశ్.న్యూ ఇయర్ సందర్భంగా ‘స్వాగ్ ఆఫ్ బోళా’ అంటూ ఈ వీడియోను విడుదల చేశారు. కాగా, ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమాకు మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో చిరుకి జోడీగా తమన్నా నటిస్తోంది. ఈ సినిమాలో చిరుకి కీర్తి సురేశ్ సోదరిగా కనపడనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..