Friday, November 22, 2024

Sankranti: తెలుగు రాష్ట్రాల్లో భోగి సందడి.. ఇళ్లకు కొత్త శోభ!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. మూడ్రోజుల సంప్రదాయ వేడుకల్లో భాగంగా నేడు ఇళ్లముందు వేసే భోగి మంటలతో సందడి మొదలైంది. ఈరోజున తెల్లవారుఝామున స్నానాలు చేసి భోగి మంటలు వేసి ఆ మంటల్లో పాత వస్తువులు వేసి పీడలను అరిష్టాలను తొలగించాలని, అందరూ భోగభాగ్యాలను పొందాలని కోరుకుంటారు.

ప్రతి సంవత్సరం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ముందు భోగి పండుగ జరుపుకుంటారు. మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణం వైపు వెళ్తాడు. ఈ సందర్భంగా వీధిలో భోగి మంటలు వేస్తారు. ఏడాది పాటూ ఇళ్లలో ఉండే పాత సామాన్లు, వాడని సామాన్లు, మూలన పడిన మంచాలు, ఇతర వాడని కలపను భోగి మంటల్లో వేస్తారు. తద్వారా ఇంట్లోని దరిద్రాన్ని వదిలించుకుంటారు. ఇంటి ముందు రంగుల ముగ్గులు వేస్తారు. ఇళ్లను మామిడితోరణాలతో అలంకరిస్తారు. పిల్లల తలపై రేగి పండ్లు పోసి… చల్లగా ఉండమని ఆశీర్వదిస్తారు. ఇలా మకర సంక్రాంతి నాడు ఇళ్లకు కొత్త శోభ వస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement