Friday, November 22, 2024

వ్యాక్సిన్ తీసుకున్నవారికి బిర్యానీ ఫ్రీ..!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మరోమారు విజృంభిస్తున్న వేళ.. వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరందుకుంది. కరోనాను వ్యాక్సినేషన్ ద్వారా కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకూ అన్ని రాష్ట్రాల్లో ‘టీకా ఉత్సవ్’ నిర్వహించనున్నారు. మరోవైపు ప్రజలు టీకా వేయించుకునేలా ప్రోత్సహించేందుకు కొన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. తాజాగా ఏపీకి చెందిన ఓ హోటల్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఫ్రీగా బిర్యానీ అందించడాని ముందుకొచ్చింది.

టీకా ఉత్సవ్ జరిగే ఏప్రిల్ 11 నుంచి 14 వరకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేవారికి బిర్యానీ ఫ్రీ అంటూ హలో కిచెన్ సంస్థ ప్రకటించింది. విజయనగరం, కాకినాడలలోని తమ బ్రాంచ్‌లలో కరోనా టీకా వేయించుకున్నవారికి బిర్యానీ ఉచితంగా అందజేయనున్నట్టు పేర్కొంది. అయితే ఆ సంస్థ కొన్ని కండీషన్స్‌ కూడా పెట్టింది. వ్యాక్సిన్ తీసుకున్న రశీదు చూపించినవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని.. మొదటి వంద మంది మాత్రమే ఉచిత బిర్యానీ పొందేందుకు అర్హులు అని తెలిపింది.దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మరోమారు విజృంభిస్తున్న వేళ.. వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరందుకుంది. కరోనాను వ్యాక్సినేషన్ ద్వారా కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకూ అన్ని రాష్ట్రాల్లో ‘టీకా ఉత్సవ్’ నిర్వహించనున్నారు. మరోవైపు ప్రజలు టీకా వేయించుకునేలా ప్రోత్సహించేందుకు కొన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. తాజాగా ఏపీకి చెందిన ఓ హోటల్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఫ్రీగా బిర్యానీ అందించడాని ముందుకొచ్చింది.

టీకా ఉత్సవ్ జరిగే ఏప్రిల్ 11 నుంచి 14 వరకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేవారికి బిర్యానీ ఫ్రీ అంటూ హలో కిచెన్ సంస్థ ప్రకటించింది. విజయనగరం, కాకినాడలలోని తమ బ్రాంచ్‌లలో కరోనా టీకా వేయించుకున్నవారికి బిర్యానీ ఉచితంగా అందజేయనున్నట్టు పేర్కొంది. అయితే ఆ సంస్థ కొన్ని కండీషన్స్‌ కూడా పెట్టింది. వ్యాక్సిన్ తీసుకున్న రశీదు చూపించినవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని.. మొదటి వంద మంది మాత్రమే ఉచిత బిర్యానీ పొందేందుకు అర్హులు అని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement