మలయాళ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ గా తెరకెక్కింది భీమ్లానాయక్ చిత్రం. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరో రానా దగ్గుబాటి ప్రధానపాత్రల్లో నటించారు. నేడు ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. కాగా మలయాళ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గినట్టుగా మార్పులు చేశారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ చిత్రాన్ని సాగర్ కే చంద్ర రూపొందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి జోడీగా హీరోయిన్ నిత్యామీనన్ నటించింది. అలాగే సంయుక్త మీనన్ ..హీరో రానా సరసన నటించింది. భీమ్లా నాయక్ సినిమాపై ముందు నుంచి భారీగానే అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ ,పోస్టర్లతో సినిమా స్థాయి పెరిగింది. ఇక ఒక్కో పాట మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ మధ్య విడుదల చేసిన ట్రైలర్ అయితే ఇంకో రేంజ్ లో ఉంది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ ద్వారా తెలుసుకుందాం…
ఇక సినిమా కథ విషయానికొస్తే .. మిలిటరీ నుంచి రిటైర్ అయిన డ్యానీ {హీరో రానా } తనకు తిరులేని విధంగా ప్రవరిస్తూ ఉంటాడు. అదే ఊరికి సబ్ ఇన్ స్పెక్టర్ గా వచ్చిన బీమ్లా నాయక్ {హీరో పవన్ కళ్యాన్} తో డ్యానీకి చిక్కులు మొదలు అవుతాయి. ఓ కేసు విషయంలో డ్యానీని భీమ్లా నాయక్ జైలుకు కూడా పంపుతాడు. తాను బెయిల్ పై వచ్చాక నీ అంతు చూస్తా అన్నట్లుగా డ్యానీ.. నాయక్ కు వార్నింగ్ ఇస్తాడు. వారిద్దరి మధ్య వైరం నెలకొంటుంది. డ్యానీ తండ్రి అతని ద్వేషానికి ఆజ్యం పోస్తూ ఉంటాడు. అలాగే భీమ్లా భార్య సుగుణ కూడా భర్తను ఏ మాత్రం తగ్గొద్దంటూ కోపాన్ని నూరి పోస్తుంది. తరువాత భీమ్లా ఇంటిని డ్యానీ కూల్చి వేయడం, డ్యానీ కారును భీమ్లా పేల్చి వేయడం ఇలా సినిమాలో చాలా సంఘటనలు జరుగుతాయి. చివరకు భీమ్లా, డ్యానీ ఇద్దరూ ఒకరికిపై ఒకరు దాడికి కూడా దిగుతారు. ఒకరినొకరు చితకొట్టేసుకుంటారు. భీమ్లా చేతిలో డ్యానీ చావడం ఖాయమని తేలుతుందిద. అదే సమయంలో.. డ్యానీ భార్య వచ్చి భీమ్లాను వేడుకుంటుంది. ఒకప్పుడు ఆమె చిన్న తనంలో భీమ్లా కాపాడి ఉంటాడు. అందువల్ల ఈ సారి కూడా ఆమె కోసం భీమ్లా, డ్యానీని వదిలేస్తాడు. ఆ పై భీమ్లా వేరే ఊరికి బదిలీ అవుతాడు. ఓ సంవత్సరం తరువాత భీమ్లా, డ్యానీ కలుసుకుంటారు. ఇద్దరూ కరచలనం చేసుకోవడంతో కథకు శుభం కార్డు పడుతుంది.
భీమ్లా నాయక్ సినిమాలో డానియల్ పాత్ర చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఇక పవర్ స్టార్ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. భీమ్లా నాయక్ ప్రధాన పాత్రల మధ్య వివాదం దర్శకుడు చాలా చక్కగా చూపించేశారు. భీమ్లా నాయక్ సినిమాకు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉంది. భీమ్లా నాయక్ లో నటి నిత్యామీనన్ చాలా బాగా నటించగా.. పవన్ అలాగే నిత్యల మధ్య కెమిస్ట్రీ సూపర్ గా ఉంది. డేనియల్ శేఖర్ పాత్రలో రానా స్క్రీన్ స్పేస్ మొత్తాన్ని ఆక్రమించేశాడని చెప్పాలి. పవన్ కొద్దిపాటి నటన డేనియల్‌ని మరింత ఎలివేట్ చేయడానికి సహాయపడుతుంది. మొత్తంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ను మించి రానా నటించారు. పవన్ కళ్యాణ్ రూపురేఖలు, హెయిర్ స్టైల్ బాలు సినిమా లోలాగా కనిపిస్తున్నాయి.
మైనస్ పాయింట్స్ : ఫస్టాఫ్ సాగదీత, కాస్త బోరింగ్ అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ : పవన్ కళ్యాణ్ , రానా యాక్టింగ్ – నిత్య మీనన్ యాక్టింగ్.. సెకండాఫ్ లోని పోరాట సన్నివేశాలు సూపర్..
చివరిగా.. మొత్తానికి పవర్ స్టార్ అభిమానుల ఆకలి తీర్చే బొమ్మ పడిపోయింది. ఈ సినిమాను చూసి ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. సినిమా చూసిన జనాలు అంతా కూడా ఒకే మాట చెబుతున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల్లో ది బెస్ ఇదేనని, నటన అదిరిపోయిందని, యాటిట్యూడ్ చూపించడంలో పవన్ కళ్యాణ్‌ను మించిన వారు లేరంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ వస్తోంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ అయితే వీర లెవెల్ అంటూ అభిమానులు సందడి చేస్తున్నారు. థియేటర్లో ఫ్యాన్స్ విజిల్స్‌తో మోత మోగిస్తున్నారు. వన్ వర్డ్‌లో చెప్పాలంటే సినిమా బ్లాక్ బస్టర్ అని అంటున్నారు.