అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని పదే పదే కాంట్రాక్టర్ అని టిఆర్ఎస్ శాసనసభ్యులు/మంత్రులు సంబోధించడంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్ స్పందించారు. టీఆర్ఎస్ సభ్యుల తీరు సరికాదన్నారు. సభ్యులు చాలా మందికి చాలా బిజినెస్ లు ఉంటాయని, అలాగని వారి వృత్తి గురించి ఎలా మాట్లాడుతామని ప్రశ్నించారు. ఎవరైనా గౌరవ సభ్యులు అని మాట్లాడాల్సిందే అని అన్నారు. స్పీకర్ కూడా నేను కాంట్రాక్టర్ అని చెప్పాడని, అలాగని కాంట్రాక్టర్ అని సభాపతిని పిలవలేము కదా అని వ్యాఖ్యానించారు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడినప్పుడు అధికార పార్టీ నేతల తీరు చూస్తే..కౌరవ సభలా అనిపించిందన్నారు. ఉద్దేశ్య పూర్వకంగానే రాజగోపాల్ రెడ్డిని పదే పదే రెచ్చగొట్టారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టు లెక్కలు చెప్పకుండా , అవినీతి గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడకుండా అధికార పార్టీ నేతలు సభను డైవర్ట్ చేశారని ధ్వజమెత్తారు. సభలో మంత్రులు గౌరవ సభ్యలుగా సంబోదించాలని, కాంట్రాక్టర్ అనడం సరైంది కాదన్నారు. సభ సంప్రదాయానికి విరుద్ధం అని భట్టి పేర్కొన్నారు.
రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్ అయితే మీరేంటి?: టీఆర్ఎస్ పై భట్టి ఆగ్రహం
Advertisement
తాజా వార్తలు
Advertisement