Tuesday, November 26, 2024

వినియోగదారులకు షాక్.. ప్రీపెయిడ్ ఛార్జీలను పెంచిన ఎయిర్ టెల్!

ప్రముఖ టెలికాం రంగ సంస్థ ఎయిర్ టెల్ తమ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ప్రీపెయిడ్ ఛార్జీలను పెంచుతున్నట్టు ఈ రోజు ప్రకటించింది. వాయిస్ ప్లాన్లపై 20 శాతం, అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్ ప్లాన్లపై 25 శాతం వరకు టారిఫ్ పెంచుతున్నట్టు వెల్లడించింది. అయితే, పెరిగిన ఛార్జీలు నవంబర్ 26 నుంచి అమల్లోకి రానున్నాయి. పెరుగుతున్న ఛార్జీల వల్ల ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) రూ. 200 నుంచి 300 వరకు చేర్చాలని భావిస్తున్నట్టు ఎయిర్ టెల్ తెలిపింది. దీనివల్ల మూలధనంపై సరైన రాబడి ఉంటుందని… ఇది ఆరోగ్యకరమైన వ్యాపార నమూనాకు దారితీస్తుందని చెప్పింది. ఆదాయం పెరగడం వల్ల స్పెక్ట్రం కొనుగోళ్లు, నెట్ వర్క్ కొనుగోళ్లలో పెట్టుబడులకు అవకాశం ఏర్పడుతుందని కంపెనీ తెలిపింది. దేశంలో 5జీ అమలుకు ఇది దోహదం చేస్తుందని అభిప్రాయపడింది.

ఎయిర్ టెల్ తాజా ప్రకటనతో నవంబర్ 26 నుండి ప్రస్తుత రూ.79 ప్లాన్ ధర రూ.99 అవుతుంది. అదేవిధంగా, రూ.149 ప్లాన్ ధర రూ. 30 అదనంగా రూ.179 కానుంది. ఇక, రూ.1,498 ప్లాన్ ఇప్పుడు రూ.1,799, రూ.2,498 ప్లాన్ ధర రూ. 2,999 అవుతంది. డేటా టాప్ అప్‌లు ఇప్పుడు రూ. 48 నుండి రూ. 58 కానుండగా.. రూ. 98 ప్లాన్ కాస్త రూ. 118కి పెరగనుంది. అదేవిధంగా రూ. 251 నుండి రూ. 301కి చేరనుంది. ఎయిర్ టెల్ ప్రకటన వినియోగదారులకు నిరాశ కలిగించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement