Wednesday, November 20, 2024

కొనసాగుతున్న రైతుల ఉద్యమం..

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం ఎక్కడా తగ్గడం లేదు.. రైతులు చేపట్టిన నిరసన నాలుగు నెలలు దాటింది. ఇప్పటికి ఢిల్లీ శివారుల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు రైతులు. అయితే ఈ నెల 26 న సంయుక్త కిసాన్‌ మోర్చా భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. రైతులు చేపట్టిన నిరసన నాలుగు నెలలు పూర్తవుతున్న సందర్భంగా బంద్‌ నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం నేత భూటాసింగ్‌ తెలిపారు. బంద్ శాంతియుతంగానే కొనసాగుతోందన్నారు భూటాసింగ్. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభావంతంగా బంద్ లో పాల్గొననున్నారు నిరసనకారులు. ఇక ఏపీలో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భారత్‌ బంద్‌కు మద్దతు ప్రకటించింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ నిరసన తెలుపుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement