భారతదేశం అంటే అన్ని మతాలు.. అన్ని భాషల సమ్మిళితం.. సమైక్యతకు చిహ్నం. కానీ, ఈమధ్య కాలంలో మతం పేరిట అల్లర్లు, నిరసనలు పెచ్చుమీరుతున్నాయి. దేశాన్ని విభజించు పాలించు అనే తరహాలో పాలన జరుగుతోందని చాలా మంది ముఖ్యమంత్రులు, సీనియర్ లీడర్లు అంటున్నారు. దీనిని ఎప్పటికప్పుడు తమదైన రీతిలో ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే.. హోలీ పండుగ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది.
ఈ ట్వీట్లో ఉన్న వీడియోలో.. ఓ హిందూ జంట హోలీ జరుపుకుంటూ రంగులు చల్లుకుంటుంది. ఆ క్రమంలో పరస్పరం రంగులు చల్లకుంటుడగా ఆ యువకుడు రంగుల చల్లే యువతి నుంచి తప్పించుకునేందకు కిందికి వంగుతాడు. దీంతో ఆమె చల్లిన రంగులు కాస్తా ఆ వ్యక్తి వెనకాల ఉన్న ముస్లిం వ్యక్తిపై పడతాయి. దీంతో అతను సీరియస్ లుక్స్ ఇస్తుంటాడు. అప్పటిదాకా సంతోషంగా ఉన్నఆ యువతిలో కూడా కాస్త బెరుకు కనిపిస్తుంది. ఇలా సీన్ మూవ్ అవుతుండగానే.. ముస్లిం వ్యక్తి భార్య కూడా సీన్లోకి వస్తుంది. ఆమె కూడా ఏం జరుగుతుందో అన్న భయంతో వారిని చూస్తుంటుంది.
ఇంతలో కిందికి వంగిన హిందూ వ్యక్తి తన చేతిలోని రంగులను తీసి ఆ ముస్లిం వ్యక్తి వైపు చాపుతూ.. తనకు కూడా రంగులు పూస్తాడు. దీంతో కాస్త అవాక్కైన ఆ వ్యక్తి తేరుకుని తన ముఖంలో చిరునవ్వు తెచ్చుకుంటూ తానూ రంగులు పూసి సంతోషిస్తాడు. అప్పటిదాకా ఆందోళనతో ఉన్న ఆ ఇద్దరు మహిళల ముఖాల్లోనూ సంతోషం కనిపిస్తుంది. వారు దగ్గరగా వెళ్లి ఒకరికొకరు రంగులు చల్లుకుంటారు.. దేశం అంటే వ్యతిరేకత కాదు.. సమైక్యత అనే ట్యాగ్‌లైన్‌తో వీడియో ఎండ్ అవుతుంది.. మీరూ చూసి ఎంజాయ్ చేయండి.. దేశం అంటే వ్యతిరేకత కాదు సమైక్యత అనే భావన చాటిచెప్పండి..
వీడియో చూడాలంటే.. www.prabhanews.com లో ఉంటుంది.. మిస్ అవకండి