కరోనా కట్టడికి భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన దేశీయ టీకా కొవాగ్జిన్‌ను 2 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలపై ఫేజ్-2, ఫేజ్-3 క్లీనికల్ ట్రయల్స్‌కు నిపుణుల కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ఎయిమ్స్, పట్నా ఎయిమ్స్, నాగ్‌పుర్ మెడిట్రినా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో దాదాపు 525 మందిపై క్లీనికల్ ట్రయల్స్ జరగనున్నాయి. ట్రయల్స్‌కు సంబంధించి భారత్ బయోటెక్ పెట్టుకున్న విజ్ఞాపనపై పూర్తి స్థాయి చర్చల అనంతరం కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్సీఓ) నిపుణుల కమిటీ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ ట్రయల్స్‌కు సంబంధించిన ప్రతిపాదనలు ఫిబ్రవరి 24నే నిపుణుల కమిటీ ఎదుటకు వచ్చాయి. అయితే ఈ ట్రయల్స్‌కు సంబంధించిన రివైజెడ్ క్లీనికల్ ట్రయల్ ప్రొటోకాల్ సమర్పించాలని నిపుణుల కమిటీ సూచించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement