పశ్చిమ బెంగాల్‌లో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. భవానీపుర్, జాంగీపుర్, సంషేర్‌గంజ్ అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తున్నారు. భవానీపుర్ అసెంబ్లీ స్థానం నుంచి బంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం ఏర్పడింది. మమతకు పోటీగా బీజేపీ నుంచి న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్ పోటీ చేస్తున్నారు. పోలింగ్ సాఫీగా సాగుతున్నట్లు ఎన్నికల అధికారులు తెలిలిపారు. ఉదయం 9 గంటల వరకు భవానీపుర్‌లో 7.57 శాతం , సంషేర్‌గంజ్‌లో 16.32 శాతం , జంగీపుర్‌లో 17.51 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కాగా, అక్టోబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఇది కూడా చదవండి: తెలంగాణ కరోనా కేసులు ఎన్నంటే..?