నేడు బంగారం..వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. దేశీయంగా మాత్రం బంగారం, వెండి ధరలు అలాగే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం రేటు రూ.49,700 వద్ద ఉంది. అయితే ఇప్పటికీ ఈ విలువ ఎక్కువే. నవంబర్ 4 గోల్డ్ రేటు కనిష్టంగా రూ.46,100గా నమోదైంది. అంటే 40 రోజుల వ్యవధిలో గోల్డ్ ధర ఏకంగా రూ.3500 మేర పెరగడం గమనార్హం. ఇక 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.54,220 వద్ద ఉంది.
గోల్డ్‌తో పోలిస్తే సిల్వర్ రేటు మరీ దారుణంగా పెరిగింది. ఇటీవల ఒక్కసారిగా రూ.74 వేల లెవెల్స్‌కు చేరింది. నవంబర్ 3న చివరిగా కిలో వెండి రూ.64 వేల వద్ద ఉండగా.. అక్కడి నుంచి సుమారు రూ.10 వేలకు పెరగడం గమనార్హం. మళ్లీ ఇప్పుడు వరుసగా 2 రోజులు పతనం కావడంతో ప్రస్తుతం కిలో సిల్వర్ రేటు హైదరాబాద్‌లో రూ.72,500 కు పడిపోయింది. బంగారం, వెండి ఇప్పుడు కొనాలనుకునేవారు కాస్త ఆగితేనే మంచిది. ప్రస్తుతం ధరలు రికార్డు స్థాయిలో ఉండటమే కారణం.