భారత్ కంటే తనకి మరొక గొప్ప ఫ్రెండ్ లేరని …భారత సంతతి ప్రజల మనసును చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డోనాల్డ్ ట్రంప్. భారత్ ను అదే పనిగా కీర్తిస్తున్నారు. భారత్, అమెరికా గొప్ప స్నేహ దేశాలని ఆయన గుర్తు చేస్తున్నారు. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలిచి, రెండో సారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలన్నది ట్రంప్ యోచన. ఈ క్రమంలోనే ఆయన ఇప్పటి నుంచే భారత్ ని కీర్తించే పనిలో పడ్డారని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. ఎందుకంటే అమెరికాలో భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్న విషయం తెలిసిందే. ట్రంప్ తాజాగా ఇండియా టుడేకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది ఇంకా ప్రసారం కావాల్సి ఉంది. ‘భారత్-అమెరికా మంచి స్నేహితులు’అని ఆయన అందులో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుల్లోనే భారత్ కు మంచి స్నేహితుడిని తానేనంటూ ఆయన ఇప్పటికే ప్రకటించారు. మోడీకి తాను మంచి స్నేహితుడినని కూడా చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement