– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
రూ. 35వేల లోపు స్మార్ట్ ఫోన్ అంటే నేటి రోజులకు సాధారణమే అని చెప్పొచ్చు. కొంతమంది అయితే లక్షల రూపాయలు పోసి ఫోన్ కొనే వారున్నారు. కానీ, రెగ్యులర్‌గా ఫోన్లు చేంజ్ చేసే వారికోసం అయితే.. ఈ ఫోన్లు బెస్ట్ అని చెప్పొచ్చు. బెస్ట్ లుక్, పవర్ఫుల్ గేమింగ్, సూపర్ కెమెరా ఆప్షన్స్-కలిగిన అయిదు ఫోన్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ సెగ్మెంట్లో నథింగ్స్ ఫోన్ (1) కూడా చోటు సంపాదించకుంది. ఇది ఇంటర్నల్‌గానే LED లైట్లతో వస్తోంది. దీంతో ఫోన్ అందంగా కనిపించడమే కాకుండా.. ఇది మీ ఇంపార్టెంట్ ఆప్షన్ అయితే మంచి కెమెరాలు..గుడ్ Android సాఫ్ట్ వేర్ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా అందిస్తుంది. ఇక.. ఇక్కడ ఇస్తున్న అన్ని ఫోన్‌లు 5G ఎనేబుల్ చేసినవే.
నథింగ్ ఫోన్ (1):
నథింగ్ ఫోన్ (1) అనేది ప్రొడక్టవిటీ ఫోకస్డ్ స్మార్ట్ ఫోన్.. ఇది బెస్ట్ (ప్రాక్టికల్) కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సెగ్మెంట్లో ఇట్లాంటి బెటర్ ఫర్మామెన్స్ ఉండడం ఇదే మొదటిది. 33వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.. కానీ, బాక్స్ లో చార్జర్ ఉండదు. యూజర్ల ప్రాధాన్యం గేమింగ్ అయితే కనుక Snapdragon 778G+ చిప్‌సెట్ తో ఇది ఎంతో మంచి ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది. ఇండియాలో నథింగ్ ఫోన్ (1) ధర 8GB RAM + 128G స్టోరేజ్ రూ. 33,999 నుండి ప్రారంభమవుతుంది.
Poco F4 5G:
Poco F4 5G స్మార్ట్ ఫోన్ కూడా మంచి ఫీచర్లతో అద్భుతంగా ఉంది. టాప్ వేరియంట్ లో అంటే 256GB స్టోరేజ్, 12GB RAM తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 870 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది పెద్ద పెద్ద గేమ్‌లను ఆడేందుకు ఎంతో సహకరిస్తుంది. అంతే కాకుండా డాల్బీ విజన్ –సపోర్టింగ్, 6.7-ఇంచెస్ AMOLED డిస్‌ప్లే కూడా ఉంది. దీంతో బెటర్మెంట్ వ్యూ కూడా ఉంటుంది. Poco F4 5G 67వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. బాక్స్ లో చార్జర్ కూడా వస్తుంది. ఇండియాలో Poco F4 5G ధర 12GB RAM + 256GB స్టోరేజ్ రేంజ్లో రూ.33,999గా ఉంది.
iQoo Neo 6 5G:
Poco F4 5Gకి iQoo Neo 6 మంచి రిప్లేస్మెంట్ అని చెప్పవచ్చు. ఫోన్ రీఫ్రెష్ రేట్ కూడా చాలా బాగుంది. అయితే 80వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. iQoo Neo 6 యొక్క కెమెరా సిస్టమ్ కూడా చాలా చాలా బాగుటుంది. దీంతో ఎంతో మెరుగైన సెల్ఫీలను తీసుకోవచ్చు. లో లైటింగ్‌లో కూడా కెమెరా AI స్కిన్ టోన్‌ని అందంగా మారుస్తుంది. – మీ ఇంపార్టెన్స్ గేమింగ్ అయితే ఇంకా ఇది బెటర్ అనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఇంకా బిగ్ బ్యాటరీ బ్యాకప్ కూడా అందిస్తుంది. ఇండియాలో iQoo Neo 6 5G ధర 12GB RAM + 256GB స్టోరేజ్ కోసం రూ. 33,999గా ఉంది.
Samsung Galaxy A53 5G:
మీరు Samsung లవర్స్ అయితే Galaxy A53 5G అనేది బెస్ట్ ఎంపిక. శామ్సంగ్ స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించడం వల్ల వినియోగదారులు బడ్స్, ట్యాబ్, ల్యాప్‌టాప్, వాచ్‌లతో వారి ప్రత్యేక లోకాన్ని సృష్టించుకోవచ్చు. – ఇది Apple ఉత్పత్తులకు పోటీగా, కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక ఖరీదైనది కూడా.. Galaxy A53 5G 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందించే మంచి డిస్‌ప్లేతో వస్తుంది. OIS-ఆధారంగా పనిచేసే64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా ఉంది. Samsung ఫోన్ రోజుల వరకు బ్యాటరీని బ్యాకప్ వస్తుంది. అయితే నథింగ్ ఫోన్ (1) మాదిరిగానే బాక్స్ లో చార్జర్ లేదు. మొత్తంమీద మీరు ఫోన్‌లో రీల్స్, మూవీస్ చూడ్డం చేసే వారైతే ఇది మంచి ఆప్షన్. ఇండియాలో Samsung Galaxy A53 5G ధర 8GB RAM + 128GB స్టోరేజ్ కోసం రూ.33,999గా ఉంది.
OnePlus Nord 2T:
iQoo Neo 6, Poco F4 లాగానే.. OnePlus Nord 2T సూపర్ ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తుంది. అయినప్పటికీ ఇది మెరుగైన బిల్డ్ క్వాలిటీని కలిగి ఉంది. ఇది MediaTek డైమెన్సిటీ 1,300 చిప్‌సెట్‌తో వస్తుంది. దీంతో ఫోన్ వేడెక్కకుండా నిరోధించడానికి కూలింగ్ సిస్టమ్ వంటివి ఏర్పాటు చేశారు. ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ సర్టిఫికేషన్‌తో 6.43-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. OnePlus ఫోన్‌ని కొనుగోలు చేయడం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే.. మీరు అనవసరమైన థర్డ్ పార్టీ యాప్‌లను పొందలేరు. ఇక.. కంపెనీ వారి సాఫ్ట్ వేర్ అప్‌డేట్‌లతో కొంచెం ఆఫ్ ట్రాక్‌లో ఉంది. ఇండియాలో OnePlus Nord 2T ధర 12GB RAM + 256GB స్టోరేజ్ కోసం రూ. 33,999గా ఉంది.