Friday, November 22, 2024

మీకు కరోనా సోకిందా.. అయితే ఆరోగ్య భీమా గురించి తెలుసుకోండి!

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా కేసులతోపాటు మరణాల రేటు కూడా పెరుగుతోంది. సెకండ్ వేవ్ లో రోజుకు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గతేడాది విజృంభించిన కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ అత్యంత వేగంతో వ్యాపిస్తోంది. దీంతో అనేక రాష్ట్రాల్లో కోవిడ్ బాధితులను ఆస్పత్రుల్లో  చేరారు. కరోనా రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. అయితే, ఆస్పత్రుల్లో చికిత్స కోసం వేలల్లో ఖర్చు అవుతోంది. దీంతో డబ్బు లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య భీమాకు ప్రాధాన్యం ఏర్పడింది.

బీమాలలో జీవిత బీమా, వాహన, ఆస్థి, భవన, వ్యాపార, గృహ బీమా మొదలయిన పలు రకాల బీమాలు ఉంటాయి. ఆరోగ్య బీమా మిగిలిన అన్నిటి కంటే ఎక్కువ ప్రాముఖ్యం పొందింది. ప్రతి బీమా సంస్థ కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లతో అనుసంధానమై ఉంటుందని.. అయితే, ఆరోగ్య బీమా పని చేసే విధానం బీమాదారు బీమా కంపెనీతో ఒప్పందం చేసుకున్న పాలసీ విధానంపై ఆధారపడి ఉంటుంది. కుటుంబం అంతటికీ కలిపి పని చేసే విధంగా కొన్ని రకాల బీమాలు ఉంటే, కొన్ని రకాల బీమాలు వ్యక్తిగతంగా మాత్రమే పని చేస్తాయి. ప్రీమియం, ఇన్సూరెన్స్ పాలసీ చెల్లించే విధానం, పాలసీలో ఉన్న నియమ నిబంధనల అనుగుణంగా ఆరోగ్య బీమా పని చేస్తుంది.

ప్రస్తుత పరిస్థితులలో కోవిడ్ నిర్దిష్ట ఆరోగ్య భీమా పాలసీలు ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ఆసుపత్రిలో చేరేందుకు తగిన రక్షణతో సమగ్ర ఆరోగ్య బీమా రక్షణ కలిగి ఉండటం మంచిది. కోవిడ్ -19 కవరేజ్ ఆరోగ్య బీమా పోర్ట్‌ ఫోలియోలో ఒక భాగంగా ఉండాలి. ఒక వ్యక్తి కోవిడ్ -19 నిర్దిష్ట పాలసీని ఎంచుకోవచ్చు. వారికి ఎటువంటి ఆరోగ్య సంరక్షణ ప్లాన్ లేకపోతే కరోనా గురించి ప్రత్యేకంగా పాలసీని పొందవచ్చు. అయితే ఇప్పుడు అన్ని ఆరోగ్య బీమా పథకాలు కోవిడ్ -19 కొరకు కవరేజీని అందిస్తున్నాయి. అలాగే కరోనా రోగులకు ఇతర శరీర భాగాలపై కూడా కొంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకోసం కొన్నిసార్లు వేర్వేరు మందులు వాడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇవి కోవిడ్ -19 నిర్దిష్ట విధానాల పరిధిలో ఉండవు. అందువల్ల అన్ని రకాల వ్యాధుల నుంచి పూర్తి కవరేజీని నిర్ధారించే ప్రైమరీ ఆరోగ్య బీమా పథకాన్ని కలిగి ఉండటం మంచిదని నిపుణును సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనవిధానంతోపాటు.. ధూమపానం అలవాటు లేనివారికి 30 సంవత్సరాల వారికి కనీసం రూ.5 లక్షల ఇన్సూరెన్స్ ఉండాలి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ ఇన్సూరెన్స్ లో మార్పు రావచ్చు.

గడువు తేదీ దాటకుండా ప్రీమియం చెల్లించినప్పుడే బీమా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. హాస్పిటల్లో చేరగానే హెల్త్ కార్డు నెంబర్, హాస్పిటల్లో చేరిన కారణంతో సహా బీమా సంస్థకు సమాచారం అందించడం చాలా ముఖ్యం. సాధారణంగా హాస్పిటల్లో ఉండే ఇన్సూరెన్స్ డెస్క్ సిబ్బంది వైద్యానికయ్యే ఖర్చును అంచనాగా వేసి సంబంధిత ఇన్సూరెన్స్ సంస్థకు తెలియచేయాలి. కోవిడ్ మహమ్మారి సమయంలో చాలా ప్రైవేటు బీమా సంస్థలు కోవిడ్ చికిత్సకు ప్రత్యేక బీమా పాలసీలను ప్రకటించాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement