అచ్చం సినిమాల్లో చూపించిన మాదిరిగానే.. అమెరికా పీపుల్స్‌ని మోసం చేస్తున్న రెండు నకిలీ కాల్ సెంటర్లను పోలీసులు మూసేశారు. నిన్న రాత్రి జరిపిన దాడుల్లో ఆశ్యర్చకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సినిమాలో చేసినట్టే కొంతమంది అమెరికాలోని ప్రజలకు ఫోన్ చేసి, వారి బ్యాంక్ అకౌంట్లో ఏదో లోపం ఉందని చెబుతారు. ఆ తర్వాత దాన్ని సరిచేస్తన్నట్టు చెప్పి, కొంత మొత్తం నగదును వారి నుంచి పొందుతున్నారు. ఇట్లా మూడు విభాగాలుగా మారి ప్రజలను మోసం చేస్తున్నట్టు పోలీసులు కనుగొన్నారు.
ఈ దాడుల్లో 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 70 మంది ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. బెంగళైరులోని వైట్‌ఫీల్డ్, మహదేవపురాల్లోని కాల్సెంటర్లపై దాడులు చేశామని, అమెరికా పౌరులను కోట్లాది రూపాయల మేర మోసం చేసిన వారిని అరెస్టు చేసినట్టు చెప్పారు. నిందితులు ఇ-కామర్స్ సైట్ల నుండి వినియోగదారుల డేటాను మోసపూరితంగా పొందేవారు. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను కాల్ టేకర్లు, బ్యాంకర్లు, క్లోజర్లుగా మూడు గ్రూపులుగా విభజించి మోసాలకు తెగబడుతున్నట్టు తెలిపారు.
కాల్ టేకర్ల పని ఏమిటంటే.. US పౌరులకు కాల్ చేసి వారి బ్యాంక్ ఖాతాలలో ఏదో అనుమానాస్పద లావాదేవీ జరిగినట్లు వారిని నమ్మించడం. ఆ కాల్‌లను నమ్మిన వ్యక్తులు బ్యాంక్ ఇష్యూకి సంబంధించిన లావాదేవీ చేయడంతో వారిని ఫిషింగ్ సైట్ ద్వారా క్యాచ్ చేయడం జరుగుతోందన్నారు. వారికి కొన్ని పరిష్కారాలను సూచించి, చార్జీలుగా డబ్బును బదిలీ చేయాలని డిమాండ్ చేస్తారని.. ఇట్లా మూడవ సెట్ ఉద్యోగులు కంపెనీ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బును బదిలీ చేయడానికి ప్రజలకు మార్గనిర్దేశం చేసేవారని తెలిపారు. నిందితులు తమ డబ్బును థాయ్‌లాండ్, హాంకాంగ్లలోని బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసేవారు. తరువాత డబ్బును హవాలా మార్గాల ద్వారా దేశానికి తీసుకువస్తున్నట్టు తమకు ఆధారాలు అందాయని పోలీసులు వివరించారు.
ప్రధాన నిందితుడు దాదాపు 70 మందిని ఉద్యోగం కోసం నియమించుకున్నాడు. ఈ మోసం గురించి పోలీసులకు తెలిసిందని, అందుకే వారిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్కు చెందిన వారు ఉపాధి పొందుతూ వారికి నగదు రూపంలో జీతాలు చెల్లించేవారు. ఉద్యోగులు పాఠశాల బస్సుల్లో తమ కార్యాలయాలకు వెళ్లేవారు. ఎథికల్ ఇన్ఫో కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిర్వహిస్తున్న రెండు కాల్ సెంటర్ల నుంచి 234 కంప్యూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. కంపెనీ గతేడాది నుంచి పనిచేస్తోందని, కోట్లాది రూపాయలు దోచుకున్నట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.