Tuesday, November 26, 2024

Weather: చలికాలం షురువయ్యింది.. తగ్గుతున్న టెంపరేచర్లతో గజగజ వణుకుతున్న సిటీ జనం

చలికాలం షురువయ్యింది. ముఖ్య పట్టణాలు, మేజర్​ సిటీస్​లో చలితీవ్రత పెరిగింది. హైదరాబాద్​లో రాత్రివేళ ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల సెల్పీయస్​ నుంచి, 14 డిగ్రీలకు పడిపోతున్నాయి. బెంగళూరులో ఇవ్వాల మునుపెన్నడూ లేనంతగా చలి తీవ్రంగా ఉన్నట్టు ఆ ప్రాంత వాసులు ట్విట్టర్​లో పోస్టులు పెట్టారు. ఎందుకంటే బెంగళూరు సిటీలో దశాబ్ద కాలంలో అక్టోబర్​ నెలలో అతి తక్కువ టెంపరేచర్లు నమోదు కావడం ఇదే ఫస్ట్​ టైమ్​ అని భారత వాతావరణ విభాగం (IMD) కూడా తెలిపింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

రుతుపవనాల సీజన్ తర్వాత.. బెంగళూరు వాసులు చలితో గజగజ వణుకుతున్నారు. మంగళవారం ఉదయం 15.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఇది 14 సంవత్సరాల్లో అక్టోబర్ నెలలో అత్యంత తక్కువ టెంపరేచర్లు నమోదైన రోజుగా అధికారులు చెబుతున్నారు. సర్జాపూర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 12.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని, నగర శివార్లలో మరింత చల్లగా ఉందని సిటీలోని వెదర్​ బ్లాగర్లు తెలిపారు.

బుధవారం ఉదయం సాధారణం కంటే -3 డిగ్రీల టెంపరేచర్లు తగ్గి బెంగళూరు సిటీలో కనిష్ట ఉష్ణోగ్రత 12.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. కర్నాటకలోని బాదామి, బీదర్ వంటి కొన్ని ప్రాంతాల్లో – బుధవారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదైంది. కొంతమంది నెటిజన్లు అయితు ట్విటర్‌లో ‘‘కూల్​ కూల్​ బెంగళూరు”అంటూ మార్నింగ్​ ఫొటోస్​ని షేర్​ చేశారు.  

కాగా, అక్టోబరు 29వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ వరకు బెంగళూరులో చిన్నపాటి వర్షాలు కానీ, ఉరుములతో కూడిన మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. అయితే.. బెంగళూరుకు చెందిన ఇండిపెండెంట్ వెదర్ ట్రాకర్, బ్లాగర్ ప్రస్తుతం టెంపరేచర్లు తగ్గడానికి సిత్రంగ్ తుపాను కారణమని తెలిపారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయన్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement