Friday, November 22, 2024

బెంగాల్ వణికిస్తున్న యాసిడ్ ఫ్లై.. ఈ ఈగ వాలితే జ్వరమే.. !!

కోల్‌కతా : దక్షిణాఫ్రికాకు చెందిన నైరోబీ ఫ్లై లేదా యాసిడ్‌ ఫ్లై అనే ఈగ చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది.. కానీ అది కుట్టాల్సిన పనిలేదు.. వాలితే చాలు వాంతులు, విరేచనాలు.. జ్వరం వస్తుంది. ఇప్పుడు ఈ ఈగ పశ్చిమ బెంగాల్‌ను హడలెత్తిస్తోంది. నైరోబీ ఫ్లై లేదా యాసిడ్‌ ఫ్లై అనే ఈగలు…శిలిగుడి, డార్జిలింగ్‌ సహా పలు ప్రాంతాల ప్రజల చర్మంపై వాలి అస్వస్థతకు గురిచేస్తున్నాయి. దీంతో వందలాది జనం అనారోగ్యం బారినపడుతున్నారు…

వీటి వల్ల అంత భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని వైద్యులు చెబుతున్నారు. ఈ ఆఫ్రికన్‌ ఈగ నారింజ, ఎరుపు, నలుపు… మూడు రంగుల్లో ఉంటుంది. ఈ కీటక శరీరంలో పెడిటిన్‌ అనే ఆమ్ల పదార్థం (యాసిడ్‌) ఉంటుంది. ఇది మానవ చర్మానికి హాని కలిగిస్తుంది. ఉత్తరాదిలో హిమాలయాల దిగువన అధిక వర్షపాతం కారణంగా అక్కడ తిరుగుతున్నాయి. గతేడాది కంటే ఈ సంవత్సరం వర్షపాతం ఎక్కువగా నమోదవడం వల్ల యాసిడ్‌ ఈగల సంచారం అసాధారణ స్థాయిలో పెరిగింది. వాస్తవానికి ఈ కీటకాలు చర్మంపై కుట్టవు. ఒంటిపై వాలినప్పుడు వాటిని కొడితే మాత్రం రసాయనం లాంటి పదార్థాన్ని విడుదల చేస్తాయి. దీని కారణంగా చర్మంపై దద్దుర్లు వస్తాయి. ఆ తర్వాత అది అంటువ్యాధిలా మారే అవకాశం ఉంది. బాధితుల శరీరంపై నైరోబీ ఫ్లై దాడి చేస్తే ఆ పురుగు కుట్టినచోట విపరీతమైన మంట తర్వాత తీవ్రంగా నొప్పి ఉంటుందని బాధితులు చెబుతున్నారు. దీనివల్ల జ్వరం బారిన పడుతున్నామని వాంతులు కూడా అవుతున్నాయని తెలిపారు. దీంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు కరోనా, మరో వైపు డెంగ్యూ, మలేరియా.. ఇంకా కొత్త కొత్త రోగాలు వస్తుండడం.. ఇదే టైంలో ఈ యాసిడ్ ఫ్లై ఈగల వల్ల జ్వరాలు వస్తుండడంతో ప్రజలు భయపడుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement