– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
జూనియర్ ఎన్టీఆర్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ కావడంపై ఆ పార్టీ లీడర్లు ఇదంతా సినిమా విషయంలో జరిగిందే కానీ, రాజకీయ ప్రాధాన్యం లేదు అని చెప్పారు. అయితే.. దీనిపై సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ జరిగాయి. అందులో ఒకటి..
మిత్రోం.. మీ ట్రిపుల్ ఆర్ సినిమా చాలా బాగుంది. అందులో మీరు పోషించిన కుమ్రుం భీం పాత్ర కూడా చాలా బాగుంది. దానికి మీరు పెట్టుకున్న టోపీ కూడా ఎంతో బాగుంది. మా వాళ్లు సినిమాని ఆడకుండా అడ్డుకుంటామని చెప్పారు కదా.. దానికి మేమే కారణం. ఆ విషయం మేమే చెప్పాం.. ఇట్లా టాలీవుడ్లోనే కాదు.. బాలీవుడ్లోనే మా లీడర్లు ఇట్లానే షారుఖ్ ఖాన్, ఇతర నటుల విషయంలో కూడా చేస్తుంటారు. ఎట్లైనా మీరంతా మా పార్టీలోకి రావాలే” లేకుంటే మీ సినిమాలు ఏవీ ఆడకుండా మా లీడర్లు అడ్డుకుంటారు” అని అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీలో మాట్లాడుకున్నట్టు సోషల్ మీడియాలో హల్ చల్ అయ్యింది.
దీనిపై పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చినా.. బీజేపీ నేతలు మాత్రం అదేం లేదు.. రాజకీయ కోణంలో దీన్ని చూడొద్దు.. కేవలం మర్యాద పూర్వక భేటీ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. ఇంకొందరేమో ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనను మెచ్చుకునేందుకు అమిత్‌షా జూనియర్ ఎన్టీఆర్‌ని పిలిపించారని, అందుకే భేటీ అయ్యారని చెప్పుకొచ్చారు.
ఇక.. ఇవ్వాల (శనివారం) వరంగల్‌లో జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు రోజు సభకు హాజరైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా (జేపీ నడ్డా) సభలో ప్రసంగించిన తర్వాత ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అదే నోవాటెల్ స్టార్ హోటల్లో హీరో నితిన్‌తో భేటీ అయ్యారు. దీనిపై కూడా ఆ పార్టీ లీడర్లు ‘‘అదంతా ఏం లేదు. మర్యాద పూర్వక భేటీ మాత్రమే’’ అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే.. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ఆర్ సినిమా బాగుందని అమిత్‌షా పొగడడానికి పిలిచారు..
ఇప్పుడేమో మాచర్ల నియోజకవర్గం సినిమా చాలా బాగుందని పొగడడానికి జేపీ నడ్డా పిలిచారా? అని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
అంతేకాకుండా.. బీజేపీలో చేరి, పలు సభలు, సమావేశాలకు అటెండ్ అవుతున్న సినీ నటి జీవిత గురించి కూడా సోషల్ మీడియాలో చలోక్తులు పేలుతున్నాయి. జీవితా రాజశేఖర్ తొలినాళ్లలో నందమూరి లక్ష్మీ పార్వతి వెంట నడిచారు. అన్నా ఎన్టీఆర్ పార్టీలో లక్ష్మీ పార్వతితో పాటు పర్యటించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో కాంగ్రెస్‌లో చేరారు. దాంతర్వాత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కండువా కప్పుకున్నారు. మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వైసీపీలో జగన్ పంచన చేరారు. ఇప్పుడేమో బీజేపీలో చేరారు. ఇట్లాంటి ఫొటోలను కలెక్ట్ చేసి ఫేస్బుక్, సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు.
‘‘అన్ని పార్టీలు తిరగండి.
అన్ని పార్టీల సభ్యత్వాలను స్క్రీన్‌షాట్ తీసుకోండి..
మీకు నచ్చిన చోట రాజకీయం చేయండి”
అని గుండు బాస్ లలిత జువెల్లర్స్‌లో వచ్చే యాడ్ మాదిరిగా కంపేర్ చేస్తున్నారు.
అయితే.. ఈ మర్యాద పూర్వక భేటీల వెనుక అసలు మతలబు ఏంటీ? సినీరంగ, క్రీడారంగంలోని ప్రముఖులను పార్టీలో చేర్చుకునే ఎత్తుగడలేనా? అన్న అంశంపై కూడా సోషల్ మీడియాలో ఎంగడతున్నారు.