Friday, November 22, 2024

జెఫ్‌ బెజోస్ టాప్

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరోసారి ప్రపంచ అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని దక్కించుకున్నాడు. జెఫ్‌ బెజోస్‌ వరుసగా నాలుగో ఏడాదీ ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో నిలిచారు. టెస్లా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎలాన్‌ మస్క్‌ రెండో స్థానంలో నిలిచారు. ఏడాది కాలంగా ప్రపంచాన్ని కరోనా పట్టి పీడిస్తున్నప్పటికీ.. కుబేరుల సంపద మరింతగా పెరగడం విశేషమని ఫోర్బ్స్‌ తన 2021 వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితాలో వెల్లడించింది.

ఎల్‌వీఎమ్‌హెచ్‌ అధిపతి బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌, మైక్రోసాఫ్ట్‌ అధిపతి బిల్‌ గేట్స్‌, ఫేస్‌బుక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌లు టాప్‌-5లో చోటు దక్కించుకున్నారు. రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా వారెన్‌ బఫెట్‌ తొలి అయిదు స్థానాల నుంచి బయటకు వెళ్లారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి, ఆసియాలో అత్యంత ధనవంతుడు ముకేశ్‌ అంబానీ 84.5 బిలియన్‌ డాలర్లతో పదో స్థానాన్ని సాధించారు. చైనాకు చెందిన జాక్‌ మా సంపద 10 బిలియన్‌ డాలర్లు పెరిగి 48.4 బి. డాలర్లకు చేరినా.. 26వ స్థానానికే పరిమితం అయ్యారు. మార్చి 5 నాటి షేర్ల ధరలు, ఎక్స్ఛేంజీ రేట్ల ఆధారంగా బిలియనీర్ల సంపదను లెక్కగట్టినట్లు ఫోర్బ్స్‌ తెలిపింది. ఈ ఏడాది కొత్తగా 493 మంది జాబితాలో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement