బార్బీ బొమ్మలా మారాలని ఓ అమ్మాయి భావించింది. దాంతో తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవటానికి తన రూపాన్ని మార్చుకోవటానికి మించిన మార్గం మరొకటి లేదని డిసైడ్ అయ్యింది. అందులో భాగంగా తన తల్లి దండ్రులకు కూడా చెప్పకుండా తనకెంతో ఇష్టమైన బార్బీ బొమ్మలా తయారయ్యే కసరత్తు మొదలుపెట్టింది. ఈ అమ్మాయిది జర్మనీ. పేరు.. జెస్సీ బన్నీ. 21 ఏళ్ల ఈ అమ్మాయి తన బార్బీ కలను నిజం చేసుకోవటానికి దేశాన్ని వదిలేసి.. దేశం కాని దేశమైన ఆస్ట్రియాలోని వియెన్నాకు విచ్చేసింది. ఇందుకోసం భారీగా ఖర్చు చేసింది. చివరకుతన డ్రైవింగ్ కోసం ఇంటి వాళ్లు ఇచ్చే డబ్బుల్ని సైతం.. తన రూపాన్ని మార్చుకోవటం కోసం ఖర్చు చేసింది. మూడుసార్లు బ్రెస్ట్ పెరిగేందుకు వీలుగా శస్త్రచికిత్సలు చేయించుకుంది. పెదాల్ని.. పిరుదుల్ని బొద్దుగా మార్చుకుంది. తాను అనుకున్నది అనుకున్నట్లుగా మారేందుకు ఆమె ఏకంగా రూ.53.6 లక్షల్ని ఖర్చు చేసింది. ప్రస్తుతం జెస్సీని చూస్తే ఎవరూ నమ్మలేరు. ఆ మాటకు వస్తే అస్సలు పోల్చుకోలేరు. మొదట్లో సాదాసీదా అమ్మాయిగా ఉన్న ఆమె.. శస్త్రచికిత్సల పుణ్యమా అని.. బార్బీ బొమ్మకు ప్రతిరూపంలా మారింది. బార్బీ బొమ్మను చూసినంతనే ఏవైతే కళ్లను ఇట్టే పట్టేస్తాయో.. అదే రీతిలో ఆమె సిద్ధమైంది. ఆమె చేసిన పనికి ఇంట్లో వారికి పిచ్చ కోపం వచ్చేసింది. ఆమెతో మాటల్ని బంద్ చేశారు. తాజాగా ఆమె తన ఇన్ స్టా అకౌంట్లో తాను మార్చుకున్న తన శరీర కొలతల్నిప్రకటించింది. తన రూపాన్ని మార్చుకున్న తర్వాత తనతో తన కుటుంబ సభ్యులు మాట్లాడటం లేదన్న ఆమె.. తాను మాత్రం మారిన రూపంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నానని చెప్పింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement