Friday, November 22, 2024

Exclusive | అందాల హిమగిరులు, హొయలొలికే తారలు.. సినిమా షూటింగ్​లతో కాశ్మీర్​కు కొత్త కళ

అందాల సుందర కాశ్మీర్​ మళ్లీ ఆర్థికంగా బలోపేతం అవుతోంది. ఒకప్పుడు మంచుకొండలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో టూరిస్టులను ఆకర్షించిన ఈ హిమగిరుల ప్రాంతం ఇప్పుడు టెర్రరిస్టుల ఆగడాలతో వెలవెలబోతోంది. ఇక.. భద్రతా బలగాలు, కూంబింగ్ ఆపరేషన్లు, టెర్రరిస్టుల ఆగడాలు, తుపాకీ మోతలు కనిపించేయి.. అయితే, కేంద్రం తీసుకుంటున్న పలు చర్యల కారణంగా ఇప్పుడిప్పుడే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో మళ్లీ సినీమా షూటింగ్​లు ప్రారంభమయ్యాయి. మంచుకొండలు, అందాల లోయ ప్రాంతం ఇప్పుడు యాక్షన్​, కట్​ సన్నివేశాలు.. సినీ తారల హొయలతో మరింత అందాలు పోతోంది.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

కాశ్మీర్​లో సినిమా షూటింగ్​లు ప్రారంభమయ్యాయి. ఇక్కడ మళ్లీ సందడి ప్రారంభం కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు. ఇవ్వాల (శుక్రవారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ కాశ్మీర్‌లో సినిమా షూటింగ్‌లు పెద్ద ఎత్తున తిరిగి నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ఆర్థిక పురోగతికి షూటింగ్​లు మరింత దోహదపడతాయన్నారు. కాశ్మీర్​లోని జీరో బ్రిడ్జ్ వద్ద లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్ సిన్హా టీవీ సీరియల్ పష్మిన్నా మొదటి రోజు షూట్‌ను ప్రారంభించారు.

షూట్ లొకేషన్‌లో గుమిగూడిన మీడియాతో సిన్హా మాట్లాడుతూ..  ఫిల్మ్ టూరిజం పునరుద్ధరణతో యూనియన్​ టెరిటోరీ (యూటీ) ఎలా అందంగా మారిందో తెలియజేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు. జమ్ము, కాశ్మీర్​ మరోసారి చలనచిత్ర పరిశ్రమకు ఇష్టమైన గమ్యస్థానంగా మారుతోందని, హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలను కాశ్మీర్‌లో చిత్రీకరించిన 1980 యుగం తిరిగి వస్తోందన్నారు. చలనచిత్ర పర్యాటక పునరుద్ధరణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని, స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. ఇప్పటికే ఇక్కడ షూటింగ్​ కోసం 300కు పైగా సినిమాలు షెడ్యూల్​ అయ్యాయని తెలిపారు.

- Advertisement -

కాగా, కాశ్మీర్ ప్రధానంగా 1960–1980ల మధ్య చలనచిత్ర పరిశ్రమకు నిలయంగా ఉంది. కాశ్మీర్ కి కాలీ, కభీ కభీ, సిల్సిలా, బేతాబ్ వంటి హిట్ చిత్రాలను కాశ్మీర్​ లోయలో చిత్రీకరించారు. అయితే, 1989లో మిలిటెంట్ల దాడులు.. బెదిరింపుల కారణంగా లోయలో తిరుగుబాటు చెలరేగింది. దీంతో అక్కడ సినిమా హాళ్లు మూతపడ్డాయి. సినిమా షూటింగ్‌లు కూడా పూర్తిగా నిలిచిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement