Tuesday, November 19, 2024

సుందర కాశ్మీరం.. శ్రనగర్‌కు యునెస్కో గుర్తింపు..

యునెస్కో సృజనాత్మక నగరాల నెట్‌వర్క్ (UNESCO Creative Cities Network)లో జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్ కు చోటు దక్కింది. దీంతో శ్రీనగర్ కు ప్రపంచస్థాయి గుర్తింపు లభించినట్లయింది. ప్రపంచంలో ఇట్లాంటి 49 సిటీస్‌ని దీనిలో కొత్తగా చేర్చారు. దీంతో 90 దేశాల్లో సృజనాత్మక నగరాల సంఖ్య 295కి చేరింది. శ్రీనగర్‌తో పాటు గ్వాలియర్ (Gwalior‌)ను జాబితాలో చేర్చాలని ‘యునెస్కో (UNESCO)తో సహకారానికి భారత జాతీయ కమిషన్‌’ గతంలో సిఫార్సు చేసింది. దీనిలో శ్రీనగర్‌కే అవకాశం దక్కింది.

దీనిపై ప్రధాన‌మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) స్పందించారు. సాంస్కృతిక, నైతికతకు నెలవైన శ్రీనగర్​కు సరైన గౌరవం దక్కిందని అన్నారు. “ఎంతో అందమైన శ్రీనగర్.. జానపద కళలు, చేతివృత్తులు వంటి ప్రత్యేక కళలతో యునెస్కో ప్రకటించిన క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ జాబితాలో చోటుదక్కించుకోవడం సంతోషంగా ఉంది. ఇది శ్రీనగర్​కు సాంస్కృతిక పరంగా మంచి గుర్తింపు. జమ్ముకశ్మీర్ ప్రజలకు అభినందనలు అని ట్విట్ట‌ర్‌లో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement