మహిళలు ఇప్పుడు అన్నిరంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు.మహిళలు ఇంటి నుండి బయటకు వచ్చి వారి శక్తిని ప్రపంచానికి చాటుతున్నారు. మహిళల విషయంలో ఇండియన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు అంపైర్లుగా అవకాశం కల్పించాలని నిర్ణయించింది. త్వరలో ప్రారంభకానున్న రంజీ ట్రోఫిలో మహిళా అంపైర్లు కనిపించనున్నారు. మన దేశంలో ప్రస్తుతం గాయత్రి, జనని, వృందారతి అనే మహిళా అంపైర్లు సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మహిళా అంపైర్ల సంఖ్యను మరింత పెంచాలని బీసీసీఐ నిర్ణయించింది. భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్ లో సైతం మహిళా అంపైర్లు కనిపిస్తారని బీసీసీఐ అధికారులు తెలిపారు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement