టీమిండియా మాజీ కెప్టెన్, BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కుటుంబాన్ని కరోనా మహమ్మారి వెంటాడుతోంది. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన గంగూలీ.. ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా గుంగూలీ కూతురు సనా గంగూలీకి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు కరోనా లక్షణాలు ఉండడంతో దాదా కూతురుసనా గంగూలీ ఈ రోజు(జనవరి 5) టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.
అయితే, తేలికపాటి లక్షణాలు ఉండడంతో సనా ఇంట్లోనే ఐసోలేషన్ అయ్యారు. సనాతో పాటు గంగూలీ మామ దేబాశిష్ గంగూలీ, కజిన్ షువ్రోదీప్ గంగూలీ, కోడలు జాస్మిన్ గంగూలీకి కూడా పాజిటివ్ అని తేలిందని సమాచారం. అయితే అందరికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయట. వరుసగా అందరూ వైరస్ బారిన పడుతుండడంతో దాదా ఫ్యామిలీ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital