బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న దాదాను కోల్కతాలోని వుడ్లాండ్స్ హాస్పిటల్లో చేర్చారని తెలుస్తోంది. ప్రస్తుతం దాదా ఆరోగ్యంగానే ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
గంగూలీకి స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు దాదా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇప్పటికే గంగూలీ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నారు. ఇటీవలే గంగూలీ సోదరుడు, తల్లి కొవిడ్ బారినపడి కోలుకున్నారు.
కాగా, అనారోగ్యంతో గంగూలీ ఆస్పత్రిలో చేరడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. తొలుత ఈ ఏడాది జనవరిలో ఛాతిలో నొప్పి రావడంతో కోల్ కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అనంతరం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో రైట్ కరోనరీ యాంజియోప్లాస్టీ నిర్వహించారు. ఈ ప్రక్రియలో భాగంగా గుండెలో రెండు స్టంట్లను అమర్చారు. అనంతరం ఆయన కోలుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital