టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ఒక స్వప్నం లాంటిదని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ కింగ్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు.మ్యాచ్ లో ఇండియా గెలిచిన తీరును అందరూ అభినందిస్తున్నారని చెప్పారు రోజర్ బిన్నీ. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కు తాను ఎంతో రుణపడి ఉన్నానని అన్నారు. దాదాపు 50 ఏళ్ల పాటు తాను కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కు సేవ చేశానని చెప్పారు. 1973లో అండర్ 19 ఆడినప్పటి నుంచి ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు అయ్యేంత వరకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తో తనకు అనుబంధం ఉందన్నారు.ఇక కోహ్లీ ఒక అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడారని రోజర్ బిన్నీ కితాబిచ్చారు. కోహ్లీ ఇన్నింగ్స్ తనకు ఒక డ్రీమ్ లా ఉందని… గ్రౌండ్ లో నలుమూలలకు కోహ్లీ బంతిని తరలించాడని రోజర్ బిన్నీ చెప్పారు. కోహ్లీ వంటి ఆటగాళ్లు ఒత్తిడిలో మరింత మెరుగైన ఆటను ఆడతారని వ్యాఖ్యానించారు రోజర్ బిన్నీ. పాక్ పై సాధించింది ఒక గొప్ప విజయమని అన్నారు. మ్యాచ్ లో పాకిస్థాన్ గెలుస్తుందేమో అనే భావనకు అందరూ వచ్చిన సమయంలో… ఒక్క సారిగా భారత్ చేతుల్లోకి వచ్చిందని రోజర్ బిన్నీ చెప్పారు. ఈ మ్యాచ్ ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని అందించిందన్నారు.
కోహ్లీపై ప్రశంసలు కురిపించిన బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ..కర్ణాటక క్రికెట్ అసోషియేషన్ కి రుణపడి ఉంటా
Advertisement
తాజా వార్తలు
Advertisement