Friday, November 22, 2024

బిసి స్టడీసర్కిల్ భవనం సిద్ధం – రేపు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం

కరీంనగర్ జిల్లాలో రెసిడెన్సియల్ గా 200 మంది విద్యార్థులు సకల సౌకర్యాలతో పోటీపరీక్షలకు సన్నద్దమయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో నిరంతరం అందుబాటులో ఉండే బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం పర్యవేక్షణలో స్టడీ సర్కిల్ రూపుదిద్దుకుంది.
కరోనా అనంతరం గురుకులాల్ని ఎప్పుడు ప్రారంభించాల్సి వచ్చిన సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వెనకబడిన ఆదిలాబాద్, మహబూబ్ నగర్ వంటి ప్రాంతాలతో పాటు 12 స్టడీ సర్కిళ్ళను, మరో 119 స్టడీ సెంటర్లను బిసి స్టడీ సర్కిళ్స్ డైరెక్టర్ కె. ఆలోక్ కుమార్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. తాజాగా కరీంనగర్ స్టడీసర్కిళ్ పక్కా భవనం ప్రారంభానికి సర్వాంగ సుందరంగా ముస్తాభవుతుందని. సువిశాల ప్రాంగణంలో దాదాపు 5 కోట్లకు పైగా నిధులు వెచ్చించి ఈ పక్కా భవనాన్ని తీర్చిదిద్దారు. నాలుగు అంతస్తుల్లో నిర్మాణం జరుపుకున్న కరీంనగర్ స్టడీసర్కిళ్లో గ్రౌండ్ ప్లోర్ లో విద్యార్థులకు మంచి హైజినిక్ వాతావరణం ఉండేలా కిచెన్, ప్రతీ ముఖ్యమైన పుస్తకం అందుభాటులో ఉంచేలా లైబ్రరీలతో పాటు అందమైన రిసెప్షన్ ఇందులో ఏర్పాటు చేసారు.మొదటి అంతస్థులో అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూంలతో పాటు, స్టాప్ రూం, డైరెక్టర్ గది, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. పై అంతస్థుల్లో వెంటిలేషన్ సౌకర్యం, వార్డ్ రోబ్, రీడింగ్ టేబుల్లతో కూడిన విశాలమైన వసతి గదుల్ని ఏర్పాటు చేశామని అధికారులు తెలియజేశారు. త్వరలోనే విద్యార్థుల కోచింగ్ కోసం ప్రారంబానికి సిద్దంగా ఉందన్నారు.

తెలంగాణ ఆవిర్బావం అయిన నాటినుండి నేటి వరకూ 15వేల పై చీలుకు విద్యార్థులకు అత్యున్నత స్థాయి శిక్షణను అందించి, 1302 మంది మేటి ఉద్యోగాల్లో చేర్చడమే కాకుండా అనేక మందిని బాంకింగ్, టెలికాం వంటి సంస్థల్లో అత్యున్నతస్థాయిని సాధించేలా బిసి స్టడీ సర్కిళ్లు తర్పీదు నిచ్చాయని మంత్రికి అధికారులు వివరించారు. కరీంనగర్లోని స్టడీ సర్కిల్ నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా, అహ్లాదాన్ని పంచేలా పరిసరాల్ని రూపొందించి భావిభరతానికి సేవలందించే విశిష్టమైన ఆఫీసర్లను తయారు చేయబోతుంది. ఈ విద్యాలయం, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కలల్ని నెరవేర్చి సమాజంలో వారి స్థాయిని మెరుగుపరిచి ఆత్మగౌరవ పతాకలుగా వారిని తీర్చిదిద్దడమే ప్రభుత్వ ఆశయమన్నారు. అందుకోసం విద్యారంగానికి సమున్నత స్థానంతో, అత్యదిక నిధులను అందించి ప్రభుత్వం నిరంతరం తోడ్పాటు నందిస్తుందన్నారు. ఇలా ఒక్కో మెట్టు అధిగమిస్తూ విద్యార్థులకు సేవల్ని అందించడం కోసం నిరంతరం మంత్రి గంగుల కమలాకర్ శ్రమిస్తామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement