తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు చెప్పిన తీపి కబురు బీసీలకు వరప్రదాయినిగా మారబోతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేసే 80,039 ఉద్యోగాల్లో బీసీల వాటాగా అత్యధికంగా 23 వేలకు పైగా బీసీ బిడ్డలు నేరుగా లబ్ధి పొందబోతున్నారని చెప్పారు. బీసీల కోసం, బీసీ సంక్షేమం కోసం ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించిన సీఎం కెసిఆర్ ని అసెంబ్లీలోని తన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు మంతృలు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ లు కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా బీసీల కోసం ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రికి తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బీసీ అభ్యర్థులు ఉద్యోగాలు సంపాదించాలని మంత్రి గంగుల ఆకాంక్షించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement