బిగ్ బాస్ సీజన్ 5 లో మూడు వార్తాలు పూర్తియింది. హౌస్ లో ఇప్పుడిప్పుడే కాకా మొదలవుతోంది. అసలు ఆట ఇప్పడి నుంచి మొదలుకానుంది. 19 మందితో మొదలైన ఈ షోలో ముగ్గురు ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం 16 మంది ఉన్నారు. సోమవారం వీరి మధ్య నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నామినేషన్ ప్రక్రియను హీటెక్కించారు. నాలుగోవారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభించిన బిగ్ బాస్, నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరు ఇంటిసభ్యుల ముఖాల్లోని ఒక భాగాన్ని తీసివేసి స్విమ్మింగ్ పూల్‌లో వేయాలని ఆదేశించాడు.
మొదటిగా ప్రియతో ఈ నామినేషన్ ప్రక్రియను ప్రారంభించాలని కోరారు. దీంతో ప్రియ.. లోబో, సన్నీ; విశ్వ.. రవి, నటరాజ మాస్టర్; లోబో.. ప్రియ, సిరి; శ్రీరామ్.. శ్వేత, ఆనీ మాస్టర్ ; షణ్ముఖ్ జస్వంత్.. యాంకర్ రవి, లోబో; నటరాజ్ మాస్టర్.. ఆర్జే కాజల్, సన్నీ ; సిరి.. ఆనీ మాస్టర్, లోబో ; మానస్.. లోబో, నటరాజ్ మాస్టర్ ; శ్వేతా.. లబో, యాంకర్ రవి ; హమీదా.. నటరాజ్ మాస్టర్, లోబో ; నటరాజ్ మాస్టర్.. విశ్వ, యాంకర్ రవి; ప్రియాంక.. లోబో, కాజల్; యాంకర్ రవి.. కాజల్, నటరాజ్ మాస్టర్ ; ఆనీ మాస్టర్… సిరి, రామ్; సన్నీ.. ప్రియ, కాజల్; జెస్సీ.. ప్రియాంక, యాంకర్ రవి లను నామినేట్ చేశాడు.
నామినేషన్ ప్రక్రియలో ఎక్కువ ఓట్స్ పొందిన నటరాజ్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, ఆనీ.. ఈ ఎనిమిది మంది ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. ఇందులో ఒకరు నాలుగో వారం ఎలిమినేట్ కానున్నారు.
ఇది కూడా చదవండి: పోసాని కౌంటర్ ఇచ్చిన పవర్ స్టార్..