44 ఏళ్ల నుంచి ఆస్ట్రేలియాకు తీరని కలగా ఉన్న గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలిచి ఆ దేశ పౌరులను సంబురాల్లో ముంచెత్తింది ఆష్లే బార్టీ.. ఇవ్వాల (శనివారం) తన సొంత గడ్డపై గ్రాండ్ స్లామ్‌ను గెలుచుకున్న మొదటి ఆస్ట్రేలియన్‌గా నిలిచింది. ఎదురన్నదే లేని అమెరికన్ డేనియల్ కాలిన్స్ పై వరుస సెట్లలో పైచేయి సాధించింది.
ప్రపంచ నెంబర్ వన్ రెండో సెట్లో 5-1తో వెనుకబడినప్పటికీ.. టై బ్రేక్‌లో విజయం సాధించి 27వ సీడ్‌ను 6-3, 7-6 (7/2) స్కోరుతో ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచింది. 2019లో ఫ్రెంచ్ ఓపెన్ విజయం.. గత సంవత్సరం వింబుల్డన్ తర్వాత 25 ఏళ్ల బార్టీకి ఇది మూడవ స్లామ్ టైటిల్. మూడు వేర్వేరు ప్రాంతాల్లో గెలుచుకున్న ఏకైక క్రియాశీల క్రీడాకారిణిగా సెరెనా విలియమ్స్ సరసన బార్టీ చేరింది.