Monday, November 18, 2024

Smart Tech: నిమిషాల్లోనే బ్యాట‌రీ ఫుల్.. మార్కెట్లోకి కొత్త‌ వ‌న్‌ప్ల‌స్ ఫోన్‌ ఎప్పుడొస్తుందంటే..

ఆపిల్ ఐఫోన్‌కి దీటుగా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త మోడ‌ల్స్‌తో మార్కెట్లోకి వ‌స్తూ.. త‌న‌దైన రీతిలో అభిమానుల‌ను సంపాదించుకుంది వ‌న్‌ప్ల‌స్‌.. అయితే ఈ మ‌ధ్య కాలంలో వ‌న్‌ప్ల‌స్ త‌న ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు వినియోగిస్తున్న ఆక్సిజ‌న్ ఓఎస్ అంటే చాలామంది లైక్ చేసేవాళ్లు, కానీ ఆక్సిజ‌న్ ఓఎస్‌ను క‌ల‌ర్ ఓఎస్‌తో మిక్స్ చేయ‌డాన్ని చాలామంది త‌ప్పుప‌డుతున్నారు. ఇంట‌ర్‌ఫేజ్ అంత ఆక‌ట్టుకునేలా లేద‌ని, ఐకాన్స్ కూడా బాగా లేవ‌ని.. ప‌ర్ఫార్మెన్స్ కూడా ఆక్సిజ‌న్ మాదిరిగా ఉండ‌డం లేద‌ని కంప్లెయింట్ చేస్తున్నారు..

అయితే.. ఈ స్మార్ట్‌ఫోన్ త‌యారీ సంస్థ వ‌న్‌ప్ల‌స్ నుంచి మ‌రో రెండు కొత్త ఫోన్లు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. త‌న స‌రికొత్త 10ఆర్ 5జీ, నార్డ్ సీఈ 2 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ల‌ను ఏప్రిల్ 28న ఆవిష్క‌రించనున్న‌ట్లు ఆ సంస్థ తెలిపింది. 10 ప్రో 5జీ ఫోన్ విజ‌య‌వంతం త‌ర్వాత వ‌న్‌ప్ల‌స్ ఇప్పుడు 10ఆర్ 5జీ తో ముందుకొచ్చింది. ఈ 10ఆర్ 5జీ ఫోన్ 150వాట్స్ సూప‌ర్ వూక్ టెక్నాల‌జీ క‌లిగి ఉంటుంది. ఇది చార్జింగ్ పెట్టిన 17 నిమిషాల్లోనే బ్యాట‌రీ ఫుల్ అవుతుంది. ఇందులో బేస్ వేరియంట్ 10 ఆర్ మాత్రం 80 వాట్స్ సూప‌ర్‌వూక్ టెక్నాల‌జీని క‌లిగి ఉంటుంద‌ని కంపెనీ తెలిపింది.

వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ 5,000 ఎంఏహెచ్ బ్యాట‌రీని క‌లిగి ఉంటుంది. ఇది 33వాట్స్ సూప‌ర్ వూక్ టెక్నాల‌జీతో అందుబాటులోకి రానుంది. ఇది బ్యాట‌రీని 0 నుంచి 50శాతం వ‌ర‌కు 30 నిమిషాల్లో చార్జ్ చేయ‌గ‌ల‌ద‌ని కంపెనీ పేర్కొంది. కాగా, మిగ‌తా ఫీచ‌ర్ల‌పై కంపెనీ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement