Tuesday, November 26, 2024

పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే బృహత్తర సంకల్పంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా రెండేండ్ల క్రితం అంబర్‌పేట నియోజకవర్గం గోల్నాక గంగానగర్‌లో బస్తీ దవాఖాన ఏర్పాటు చేయడంతో పేదలకు ప్రభుత్వ వైద్యం ఉచితంగా అందిస్తున్నా రు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్తీ దవాఖాన పని చేస్తోంది. మధుమేహం, బీపీ తదితర సాధారణ వ్యాధులతో పాటు సీజనల్‌ వ్యాధులు, చిన్నపిల్లకుకు సంబంధిచిన వ్యాధులతో పాటు గర్భిణులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనా నేపథ్యం లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నిబంధనలకు అనుగునంగా ప్రతి రోజూ వైద్య సేవలు అందిస్తున్నారు.

బస్తీ దవాఖానలో ఒక డాక్డర్‌, నలుగురు నర్సులు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రతి రోజూ దవాఖానను శానిటైజ్‌ చేస్తున్నారు. వ్యాధి గ్రస్తులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా ఇస్తున్నారు. అలాగే దవాఖానకు వచ్చిన వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారు. గంగానగర్‌ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలో పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో ఉంచారు. రోజు రోజుకూ దవాఖానకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement