వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాషియర్ చోరీ కేసులో ఇంకా పురోగతి లేదు. ఐదు రోజులు గడుస్తున్నా క్యాషియర్ ప్రవీణ్ ఆచూకీ దొరకలేదు. బ్యాంక్ అధికారులపై ఆరోపణలు చేస్తూ బ్యాంక్ లో డబ్బులకు సెక్యూరిటీ లేదు అంటూ ప్రవీణ్ సెల్ఫీ వీడియోలు పంపిస్తున్నాడు. నిన్న సాయంత్రం వరకు తానే వస్తున్న అంటూ క్యాషియర్ ప్రవీణ్ సెల్ఫీ వీడియోలో తెలిపాడు. అయితే, క్యాషియర్ ప్రవీణ్ బులెట్ బైక్ చిట్యాలలో గుర్తించారు. దీంతో వనస్థలిపురం పోలీసులు బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారమే చోరికి కారణం అని పోలీసులు భావిస్తున్నారు. ఫోన్ కాల్ డాటా, సిసి పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక టీంలను రంగంలోకి దింపి ప్రవణ్ కోసం గాలిస్తున్నారు.
కాగా, బ్యాంక్ ఆఫ్ బరోడా వనస్థలిపురం బ్రాంచ్‌లోని క్యాష్‌కౌంటరులో రూ.22.53 లక్షలతో పరారైన క్యాషియర్ గురువారం తాను బ్యాంకుకు ఎలాంటి డబ్బును స్వాహా చేయలేదని పేర్కొంటూ వీడియోను ప్రసారం చేశారు. బుధవారం బ్యాంకు చీఫ్ మేనేజర్ వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ప్రవీణ్ కుమార్ తనకు తలనొప్పిగా ఉందని, మందులు కొనుక్కోవడానికి బయటకు వెళ్లాలని చెప్పాడని తెలిపారు. సాయంత్రం 4 గంటల వరకు ప్రవీణ్ తిరిగి రాకపోవడంతో రోజు ఖాతాలను పరిశీలిస్తున్న బ్యాంకు అధికారులు రూ.22 లక్షలకు పైగా నగదు మాయమైనట్లు గుర్తించారు.