Saturday, November 23, 2024

చ‌ట్టాల‌ను ఉల్లంఘిస్తూ హింస‌కి పాల్ప‌డుతోన్న ర‌ష్యా – వీడియో షేర్ చేసిన ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ‌శాఖ‌

ఉక్రెయిన్ దేశంలోని రెండో ప్ర‌ధాన న‌గ‌రం ఖార్కివ్ న‌గ‌రాన్ని స్వాధీనం చేసుకొనేందుకు ర‌ష్యా ప్ర‌య‌త్నిస్తోంది. దాంతో ర‌ష్యా బ‌ల‌గాల‌ను ఉక్రెయిన్ నిలువ‌రిస్తోంది. రష్యా దాడులకు సంబంధించి వెలుగులోకి వస్తున్న కొన్ని వీడియోలు.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై ఆందోళనను మరింతగా పెంచుతున్నాయి. ఖార్కివ్ లోని ఒక అడ్మినిస్ట్రేటివ్ భవనంపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో షేర్ చేసింది. రష్యన్ క్షిపణి భవనాన్ని తాకడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం కనిపిస్తుంది. ఆ సమయంలో రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాలు ఉన్నాయి.రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ పౌరులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపిస్తూ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ట్వీట్ చేసింది, “అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘిస్తూ రష్యా యుద్ధం చేస్తోంది. పౌరులను చంపుతుంది. పౌర మౌలిక సదుపాయాలను నాశనం చేస్తుంది. ఇప్పుడు క్షిపణుల ద్వారా పెద్ద నగరాలపై కాల్పులు జరపడమే రష్యా ప్రధాన లక్ష్యం’ అని ట్వీట్‌లో పేర్కొంది.

ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి Dmytro Kuleba కూడా క్షిపణి దాడి దృశ్యాలను ట్వీట్ చేశారు. ‘ఖార్కివ్‌లోని సెంట్రల్ ఫ్రీడమ్ స్క్వేర్, రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్‌లపై అనాగరికంగా రష్యన్ క్షిపణి దాడులు చేసింది. పుతిన్ ఉక్రెయిన్‌ను విచ్ఛిన్నం చేయలేకపోయాడు. అతను కోపంతో మరిన్ని యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాడు. అమాయక పౌరులను హత్య చేస్తున్నాడు. ప్రపంచం మరింతగా ఒత్తిడిని పెంచి.. రష్యాను ఒంటరిగా చేయండి’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ కు పాశ్చాత్య దేశాల నుండి మద్దతు పెరుగుతుంది., బ్రిటన్ నుండి ఆయుధాలు ఉక్రెయిన్ కు భారీగా వస్తున్నాయి. ఫిన్లాండ్ 2500 అసాల్డ్ రైఫిల్స్, 1500 యుద్ధ ట్యాంకులను పంపనుంది. కెనడా యాంటీ ట్యాంక్ ఆయుధాలు, మందు గుండు సామాగ్రిని సరఫరా చేస్తుందని ఆ దేశ ప్రధాని ట్రూడో ప్రకటించారు.మరో వైపు రష్యాపై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలను విధిస్తున్నాయి.

https://twitter.com/DmytroKuleba/status/1498569115950272517

Advertisement

తాజా వార్తలు

Advertisement