Monday, November 18, 2024

కాశ్మీర్ లో ఉగ్ర‌వాదులు..భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య కాల్పులు-ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

బారాముల్లాలో ఉగ్ర‌వాదులు..భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య జ‌రిగిన ఎన్ కౌంట‌ర్ లో నిషేధిత ఉగ్ర‌వాద సంస్థ జైషే మ‌హ్మ‌ద్ తో సంబంధం ఉన్న ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యార‌ని కాశ్మీర్ అద‌న‌పు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీసులు తెలిపారు. షోపియాన్, బారాముల్లా జిల్లాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. బారాముల్లాలోని యెడిపోరా, పట్టన్ ప్రాంతంలో కూడా ఎన్‌కౌంటర్ జరిగింది. స్థానిక ఉగ్రవాదులు ఇద్దరూ నిషేధిత ఉగ్రవాద సంస్థ జేఎంతో సంబంధం కలిగి ఉన్నారు. సెర్చ్ ఆపరేషన్ కొన‌సాగుతోంది. మరిన్ని వివరాలు అనుసరించాల్సి ఉంటుంది-కాశ్మీర్ ఏడీజీపీ పేర్కొంది. కాగా షోపియాన్ జిల్లాలోని చిత్రగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య మరో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement