సోమ,మంగళ వారాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే రెండు రోజులపాటు డిపాజిట్లు, విత్ డ్రా,చెక్ క్లియరెన్స్, రుణ అనుమతులు ఆగనున్నాయి. మొత్తం ఈ సమ్మెలో పది లక్షల మంది వరకు బ్యాంకు ఉద్యోగులు అధికారులు పాల్గొనే అవకాశం ఉంది.
మరోవైపు సమ్మె కారణంగా ఏటీఎమ్ సేవలకు కూడా ఇబ్బంది కలగవచ్చని తెలుస్తోంది. కానీ ప్రైవేటు బ్యాంకులు మాత్రం యధావిధిగా కొనసాగనున్నాయి.