Thursday, November 21, 2024

ఖాతాదారులకు గమనిక.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్

బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. బ్యాంకులకు వరుసగా ఐదు రోజుల సెలవులు రానున్నాయి. ఇప్పటికే నాలుగో శనివారం, ఆదివారంతోపాటు రెండు రోజుల పాటు సమ్మెతో బ్యాంకులు నాలుగు రోజులపాటు మూతపడ్డాయి. ఇప్పుడు ఏప్రిల్ మాసంలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు వరుసగా ఐదు రోజుల సెలవులు ఉన్నాయి. దీంతో బ్యాంకు లో ఏదైనా పని ఉంటే… దానిని ఈ రోజే పూర్తి చేసుకోవడం మంచిది. లేదంటే మీ ఆర్థిక లావాదేవీలకు బ్రేక్ పడుతుంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఏప్రిల్ 1 యానివల్ క్లోజింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్. అంటే దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ ఉంటాయి. ఏప్రిల్ 2 ఉగాది పర్వదినం (రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు), ఏప్రిల్ 3న ఆదివారం, ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ (తెలంగాణలో బ్యాంక్ హాలిడే). దీంతో ఖతాదారులు తమ బ్యాంకు పనులు ఈ రోజే పూర్తి చేసుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement