హైదరాబాద్ లోని పూడింగ్ అండ్ మింగ్ పబ్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఎఫ్ఐఆర్ లో మొత్తం నలుగురిని నిందితులుగా చేర్చారు. అనిల్, అభిషేక్, కిరణ్ రాజ్, అర్జున్ పేర్లను నిందితులుగా నమోదు చేశారు. అయితే, వీరిలో అర్జున్ విరమచినేని, కిరణ్ రాజ్ పరారీలో ఉన్నారు. దీంతో పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయినా అనిల్ , అభిషేక్ లను రిమాండ్ తరలించనున్నారు.
కాగా, హైదరాబాద్ లోని కొన్ని పబ్బుల్లో చాపకింద నీరులా డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్లు తరచూ ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో బంజారాహిల్స్‌లో రోడ్డు నంబర్4లోని రాడిసన్ బ్లూ హోటల్ ఉదంతం వెలుగులోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా దాడి చేశారు. అనూహ్య పరిణామంతో బిత్తరపోయిన యువతీయువకులు తమ చేతుల్లోని సిగరెట్లు, డ్రగ్స్‌ను బయటకు విసిరేశారు. ఐదు గ్రాముల కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకొన్నా రు. పబ్‌లో 150 మంది మంది ఉన్నారు. ప్రత్యేక యాప్‌ను రూపొందించి, అందులో పేరు నమోదుచేసుకొన్నవారికి ప్రత్యేక కోడ్ ఇస్తున్నారు. ఆ కోడ్ ఉన్నవారినే పబ్ లోపలికి అనుమతిస్తారు. దీనిపై పక్కా సమాచారం సేకరించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి డెకాయ్ అపరేషన్‌కు వ్యూహం రచించారు.