Thursday, November 21, 2024

కరోనా ఎఫెక్ట్: భారత్ తో సరిహద్దులు మూసివేసిన బంగ్లా..

భారత్​లో కోవిడ్​ కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్​తో ఉన్న తమ దేశ సరిహద్దుల్ని 14రోజుల పాటు మూసివేస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. భారత్​లో కరోన కేసులు పెరుగుతున్నందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో భారత్ నుంచి బంగ్లాదేశ్ కి రోడ్డు మార్గాన వెళ్లేందుకు వచ్చే 14 రోజులు రహదారులు మూసుకపోయినట్లే. ఇప్పటికే కోవిడ్ -19 కేసుల పెరుగుదల కారణంగా ఏప్రిల్ 14 నుండి బంగ్లాదేశ్ , భారత్ ల మధ్య విమాన ప్రయాణం నిలిపివేయబడింది. ఇప్పుడు రోడ్డు మార్గాలు కూడా మూసివేయబడ్డాయి. అయితే కార్గో విమాన రాకపోకలపై ఎటువంటి ఆంక్షలు లేవని పేర్కొంది బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement